చెర్రీ-శోభిత కాంబో.. అసలు విషయమిదే!
అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇప్పుడు అసలు విషయం తెలిసింది.
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ అటు సినిమాలతోపాటు ఇటు ఫ్రీ టైమ్లో పలు యాడ్స్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ఛేంజర్ సినిమాలో నటిస్తున్న ఆయన.. తాజాగా హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ఓ యాడ్లో నటించారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇప్పుడు అసలు విషయం తెలిసింది.
ఇప్పటికే కొన్ని బ్రాండ్స్కు సంబంధించిన యాడ్స్లో నటించిన రామ్చరణ్.. తాజాగా శోభితతో కలిసి ఫేమస్ క్లాతింగ్ కంపెనీ మాన్యవర్ యాడ్లో నటించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యాడ్ అయినా సినిమా అయినా చరణ్ యాక్షన్ అదుర్స్ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం చెర్రీ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.
ఈ యాడ్లో రామ్చరణ్ సింపుల్ లుక్లో కనిపించారు. ఓ వరుడిగా ముస్తాబైన ఆయన ధోతి పంచె కట్టుకుని కనిపించారు. చూసేందుకు ఇది చాలా సింపుల్ లుక్లా కనిపించినప్పటికీ దానిపై జ్యూయెలరీ ధరించి సూపర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక వధువుగా శోభిత కూడా ఎంతో అందంగా ముస్తాబయ్యారు. ఆమె పింక్ శారీలో బుట్టబొమ్మలా కనిపించారు. యాడ్లో ఎలాంటి డైలాగ్స్ వారి చెప్పనప్పిటికీ తమ హవభావాలతోనే అన్ని ఎమోషన్స్ను పండించారు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ఓవర్లో వారే డైలాగులు చెప్పుకున్నారు. ఇద్దరికీ వివాహం జరిగినట్లు యాడ్లో చూపించారు. పెళ్లి పట్టు వస్త్రాలకు ప్రమోషన్కు ఈ యాడ్ చేసినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్లో గూఢచారి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శోభిత.. ఆ తర్వాత మేజర్, పొన్నియిన్ సెల్వన్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. చేతినిండా దక్షిణాది సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. బాలీవుడ్లోనూ సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు. ఇటీవలే హిందీ మూవీ ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్లో బోల్డ్ పాత్రలో నటించి మెప్పించారు.
మోడల్గా కెరీర్ మొదలుపెట్టిన స్టార్ట్ చేసిన శోభిత అప్పట్లో కొన్ని యాడ్స్ చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు స్టార్ హీరో రామ్చరణ్తో కలిసి యాడ్లో యాక్ట్ చేశారు. ప్రస్తుతం మెగా హీరో రామ్చరణ్ గేమ్ ఛేంజర్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చెర్రీ సినిమా తీయనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.