మెగా రావిపూడి.. ఓ ప్లాన్ సెట్టయ్యింది!

ఈసారి చిరంజీవితో మాస్-ఫన్ దర్శకుడు అనిల్ రావిపూడి కలవబోతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-03-26 07:19 GMT
Chiranjeevi Anil Ravipudi Movie Update

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'ఆచార్య' తర్వాత కాస్త స్లో అయిన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ప్రస్తుతం భారీ స్థాయిలో రూపొందుతున్న 'విశ్వంభర' చిత్రం షూటింగ్‌ను పూర్తి చేశారు. మే 9న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా, ఇప్పుడు ఆయన తదుపరి సినిమా గురించి మరో అప్‌డేట్ బయటకి వచ్చింది.

ఈసారి చిరంజీవితో మాస్-ఫన్ దర్శకుడు అనిల్ రావిపూడి కలవబోతున్న విషయం తెలిసిందే. వరుస హిట్స్‌తో నిలిచిన అనిల్, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో తన బ్లాక్‌బస్టర్ స్ట్రీక్‌ను కొనసాగించాడు. ఇక ఇప్పుడు చిరంజీవితో క‌లిస్తే మరింత మేజిక్ కనిపించనుందన‌డంలో ఎలాంటి అనుమానమే లేదు. ఈ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది.

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం, చిరు అనిల్ రావిపూడి చిత్రం ఉగాది రోజున అంటే మార్చి 30న లాంఛనంగా ప్రారంభం కానుంది. అదే మొదటి ముహూర్తం. ఈ సందర్భంగా ఒక చిన్న పూజా కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు సమాచారం. అనంతరం పూర్తి స్థాయిలో షూటింగ్ మే నెలలో మొదలవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్న ఈ సినిమాకు ఇప్పటివరకు నాలుగు పాటలు కంపోజ్ అయ్యాయట. అంటే ఆల్బమ్ ఇప్పటికే హాఫ్ కంప్లీట్ అయిపోయినట్టే.

ఈ చిత్రాన్ని తక్కువ టైంలోనే పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ చేశారు. ఇది చిరంజీవి నుండి సంక్రాంతికి వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులే కాదు, బాక్సాఫీస్ కూడా వేచిచూస్తోంది. పైగా అనిల్ రావిపూడికి సంక్రాంతి హిట్ సెంటిమెంట్ ఉండటంతో, ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ కావాలని టీమ్ ఆశిస్తోంది. కామెడీతో పాటు మాస్ ఎలిమెంట్లను మిక్స్ చేసే స్క్రిప్ట్ సిద్ధమైపోయిందని సమాచారం.

మొత్తానికి చిరంజీవి కెరీర్‌లో మరో మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ ప్రాజెక్ట్ నిలవనుంది. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ అందర్నీ ఆకట్టుకునేలా అనిల్ మాస్ టచ్‌తో మలిచే ఈ సినిమా... చిరు అభిమానులకు ఫుల్ ఫన్‌ను అందించబోతోందనడంలో డౌట్ లేదు. ఇక ఉగాది రోజు ముహూర్తంతో మొదలయ్యే మెగా మాస్ జర్నీ, సంక్రాంతికి ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.

Tags:    

Similar News