ఫోటో స్టోరి: చిరు ధరించిన చెప్పుల ఖరీదు 2 లక్షలా?
రాజకీయాల నుంచి నిష్కృమించి సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి.
రాజకీయాల నుంచి నిష్కృమించి సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. అయినా రాజకీయ రంగంలో స్నేహితులు ఎవరినీ ఆయన విడిచిపెట్టరు. వారితో సత్సంబంధాలను కొనసాగించడంలో ఎప్పుడూ ముందుంటారు. సినీరాజకీయ రంగాల్లో ప్రముఖులందరికీ చిరు ఆప్తుడు..అందరివాడు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి, చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పాలన సాగుతుంటే ఆ ఆనందం మెగాస్టార్ లోను స్పష్ఠంగా ఇనుమడిస్తోంది.
ఇటీవల బెజవాడ వరదల్లో మునకలు వేయగా, ముఖ్యమంత్రి నిధి కోసం కోటి రూపాయల విరాళాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఆయన తనయుడు రామ్ చరణ్, సోదరుడు పవన్ కల్యాణ్, మేనల్లుడు అల్లు అర్జున్, సాయిధరమ్ సహా కుటుంబ హీరోలందరి సాయం రూపేణా సుమారు 8 కోట్ల వరకూ ఒక్క మెగా కుటుంబం నుంచే బెజవాడ బాధితులకు అందుతోంది. ఈ దసరా పండగ రోజున మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చంద్రబాబు నాయుడును కలుసుకుని వరద సాయం కోసం ప్రకటించిన చెక్కులను అందజేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే వైరల్ అయ్యాయి.
అయితే బాబుతో భేటీ సమయంలో మెగాస్టార్ డ్రెస్సింగ్ సెన్స్, ఆయన తొడుక్కున్న చెప్పులు ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. బ్లూ జీన్స్- బ్లాక్ షర్ట్ లో సింపుల్ గా కనిపించిన చిరు ఫ్యాషన్ సెన్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆయన కాలికి ఉన్న చెప్పులను చూడగానే స్టన్నయిపోయారంతా. ఇవి అత్యంత ఖరీదైన, పాపులర్ అంతర్జాతీయ బ్రాండ్ గూచీ (Gucci) కంపెనీవి. వీటి ఖరీదు సుమారు 2 లక్షల వరకూ ఉంటుందని అంచనా. దాదాపు 3000 అమెరికన్ డాలర్లకు పైగానే ధర ఉంటుందని, అదనంగా ట్యాక్స్ కూడా చెల్లించాలని ఆన్ లైన్ వెల్లడిస్తోంది. అయితే ఇవి చెప్పులేనా లేక షూస్ అని పిలవాలా? అంటే వీటిని నిజానికి మ్యూల్స్ (Mules) అని పిలుస్తారు. ముందుకు చూస్తే షూలా కనిపించినా కానీ ఇవి చెప్పులే. వెనక భాగంలో సులువుగా ధరించే విధంగా ఉంటాయి. ఈ తరహా మ్యూల్స్ ఇప్పుడు యూత్ లో ట్రెండ్ గా మారాయి. ఇక 60ప్లస్ లోను మెగాస్టార్ నవయువకుడిలా మురిపిస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న `విశ్వంభర`లోను ఆయన యంగ్ లుక్ తో కనిపించనున్నారు. నేటితరం స్టార్లకు ఆయన ఇంకా పోటీ ఇస్తూనే ఉన్నారు. చూస్తుంటే గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు రోజులను వెనక్కి తెచ్చేట్టు ఉన్నారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.