మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ లైన‌ప్ ఇలా!

మెగాస్టార్ చిరంజీంవి బాడీ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ అభిమానుల‌కు ఓ సర్ ప్రైజ్ లాంటింది.

Update: 2024-12-07 06:09 GMT

మెగాస్టార్ చిరంజీంవి బాడీ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ అభిమానుల‌కు ఓ సర్ ప్రైజ్ లాంటింది. 70లోనూ చిరంజీవి చింపేసే న్యూలుక్ ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. వాటిని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అన్న‌య్య 70 లోనూ ఏమాత్రం త‌గ్గ‌లేదు. అదే లుక్..అదే గ్రేస్ మెయింటెన్ చేస్తున్నారంటూ త‌మ్ముళ్ల‌చే ప్ర‌శంస‌లు అందుకున్నారు. చిరంజీవి ఏకంగా ఓ 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లిన‌ట్లే ఉంది.

మ‌రి చిరంజీవిలో ఇంత మార్పు ఎందుకిలా అంటే భ‌విష్య‌త్ ప్రాజెక్ట్ ల కోస‌మే ఇలా ట్రాన్స‌ఫ‌ర్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే చిరంజీవితో సినిమాలు చేయ‌డానికి ద‌ర్శ‌కులంతా క్యూలో ఉన్నారు. రచయిత బివిఎస్ రవి స్క్రిప్ట్ రాసి మెగాస్టార్‌ని మెప్పించాడు. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా మోహన్ రాజా ని రంగంలోకి దించాల‌ని చూస్తు న్నారు. మ‌రోవైపు ర‌ద్ద‌యింద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది. అలాగే హ‌రీష్ శంక‌ర్ కూడా మెగాస్టార్ కి టచ్ లో ఉన్నారు. ఇద్ద‌రు క‌లిసి ఓ క‌మ‌ర్శియ‌ల్ యాడ్ చేసిన స‌మ‌యంలో చిరు క‌థ సిద్దం చేయ‌మ‌ని శంక‌ర్ కి చెప్పిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది. కానీ అందుకు స‌మ‌యం ప‌డుతుంది.

ఇక యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి సీనియ‌ర్ హీరోలకు ఓ వ‌రంలా మారిన సంగ‌తి తెలిసిందే. బాల‌య్య‌, వెంకీల‌కు ఇప్ప‌టికే మంచి విజ‌యాలు అందించారు. అది చూసిన చిరంజీవి నాతో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్? అని ర్యాపో మొద‌లైంది. కొన్ని నెల‌లుగా ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌చ్చే ఏడాది ఉండే అవ‌కాశం ఉంద‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తార‌ని స‌మాచారం. దీనిని 2026 సంక్రాంతికి విడుదల చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇటీవ‌లే మెగా కాంపౌండ్ లోకి `ద‌స‌రా` ఫేం శ్రీకాంత్ ఓదెల కూడా చేరాడు. చిరంజీవితో త‌న మార్క్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనింగ్ స్క్రిప్ట్ తో మెప్పించారు. ఈ చిత్రం 2026 తొలిరోజుల్లో ప్రారంభమవుతుంది. సుధాకర్ చెరుకూరి నాని ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తారు. అలాగే `యానిమల్` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. వీరిద్ద‌రి మ‌ధ్య కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తాజా స‌మాచారం. అయితే అవి ఇంకా ఆరంభ ద‌శ‌లోనే ఉన్నాయి. సందీప్ రెడ్డి పూర్తి చేయాల్సిన క‌మిట్ మెంట్లు కొన్ని ఉన్నాయి. ఆ త‌ర్వాతే చిరంజీవి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టే అవ‌కాశం ఉంటుంది. అందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది.

Tags:    

Similar News