'చిరంజీవి' వెనుక సీక్రెట్ చెప్పేసిన చిరంజీవి!
అసలు చిరంజీవి అనే ఒక ఊరు ఉంటుందని నాకు అప్పటి వరకూ తెలియదు. ఇదే విషయాన్ని అమ్మకు చెబితే స్క్రీన్ నేమ్ గా ఇదే ఎందుకు ఉండకూడదు అని అన్నారు.
చిరంజీవిని మెగాస్టార్..అన్నయ్య..బాస్ అంటూ అభిమానంతో పిలుచుకుంటారు అభిమానులు. చిరంజీవి అసలు పేరు ఏంటి? అన్నది చాలా మందికి తెలిసిందే. శివశంకర వరప్రసాద్ అన్నది తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ స్క్రీన్ నేమ్ మాత్రం చిరంజీవి. మరి చిరంజీవి అనే పేరు అసలు అన్నయ్యకి ఎలా వచ్చింది? అంటే దీనికి వెనుక చాలా పెద్ద కథే ఉందని తెలుస్తోంది. అదేంటే చిరంజీవి మాటల్లోనే..
'మనం సినిమా యాక్టర్ అయిపోతే శివ శంకర వర ప్రసాద్ అని తెరపై కనిపిస్తే కాస్త ఇబ్బంది ఉంటుంద నిపించింది. అలాగని శివ, శంకర, ప్రసాద్ ఇలా ఏపేరు పెట్టుకున్నా పాతగానే అనిపిస్తుంది. ప్రత్యేకమైన పేరు ఉంటే బాగుండనుకున్నా. సాధారణంగా మనకి వచ్చిన కలలు గుర్తుండవు. కానీ ఒకరోజు నాకొచ్చిన కల అలా గుర్తుండిపోయింది. నేను రాములవారి గర్బగుడి ముందు సొమ్మసిల్లు పడుకుని ఉన్నాను.
ఆ సమయంలో ఓ పదేళ్ల అమ్మాయి గుడిలోకి వచ్చి ఏంటి చిరంజీవి ఇక్కడ పడుకున్నావ్. బయటకు వెళ్లి పనిచేసుకో. టైమ్ అయింది అనే సరికి నేను లేచాను. చుట్టూ చూస్తే ఇదేంటి గుడిలో ఉన్నాను అని పించింది. నా పేరు శివ శంకర కదా? చిరంజీవి అని పిలవడం ఏంటి ? అని నేను ఉలిక్కి పడి లేవడం ఏంటి? అనుకుంటూ వస్తండగా గుడి గోడ బయట నుంచి నా స్నేహితుడు కూడా చిరంజీవి రారా వెళ్దాం అని పిలిచాడు.
ఇదేంటి అందరూ ఇలా పిలుస్తున్నారు అనుకుంటుండగా నిద్ర నుంచి మెలకువ వచ్చింది. అసలు చిరంజీవి అనే ఒక ఊరు ఉంటుందని నాకు అప్పటి వరకూ తెలియదు. ఇదే విషయాన్ని అమ్మకు చెబితే స్క్రీన్ నేమ్ గా ఇదే ఎందుకు ఉండకూడదు అని అన్నారు. దీంతో తెరపై నాపేరు అడిగితే చిరంజీవి అని చెప్పేసా. అలా నా స్క్రీన్ నేమ్ చిరంజీవి అయింది' అన్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా 'విశ్వంభర' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.