ఒక్కటవ్వాల్సిన టైం వచ్చిందా..?
ఐతే వాళ్లు కలవడం ఆడియన్స్ దాకా రాదు కాబట్టి వారి సినిమాల మధ్య ఉన్న వైరమే వారి మధ్య ఉంటుందని అనుకుంటారు.
స్టార్స్ మధ్య పోటీ ఎలా ఉన్నా ఒకరి మీద మరొకరికి గౌరవ మర్యాదలు ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. ఒక ఇద్దరు స్టార్స్ సినిమాలతో పోటీ పడతారేమో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా కలిస్తే మాత్రం ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు. సినిమాల మధ్య ఫైట్ వారి పర్సనల్ రిలేషన్ షిప్ దాకా తీసుకు రారు. ఐతే వాళ్లు కలవడం ఆడియన్స్ దాకా రాదు కాబట్టి వారి సినిమాల మధ్య ఉన్న వైరమే వారి మధ్య ఉంటుందని అనుకుంటారు.
ఇక ఎవరి ఫ్యాన్స్ వారి హీరోనే గ్రేట్ మిగతా వారంతా ఆయన తర్వాతే అన్నట్టుగా చెబుతుంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్ వార్స్ పీక్స్ కి వెళ్లాయి. ఎంతగా అంటే ఒక సినిమాను కిల్ చేసే రేంజ్ కి దీని ఎఫెక్ట్ పడింది. స్టార్ సినిమా అంటే చాలు యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కటై ఆ సినిమాను ట్రోల్ చేయడం సినిమా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఐతే వీరు చేసినంత మాత్రాన సినిమా ఫ్లాప్ అవుతుందా అన్న మాట ఉన్నా ఏమాత్రం తేడా కొట్టినా ఈ యాంటీ ఫ్యాన్స్ వల్ల సినిమా నిజంగానే మరుగున పడుతుంది. అంతేకాదు కొన ఊపిరితో ఉన్న సినిమాని ఈ ట్రోల్స్ వల్ల పూర్తిగా డెడ్ అవుతుంది.
ఇక ఈమధ్య స్టార్ హీరోల సినిమాల హెచ్.డి ప్రింట్ లను యాంటీ ఫ్యాన్స్ కావాలని లీక్ చేస్తున్నారు. సినిమా రిలీజైన వెంటనే ఈ హెచ్.డి ప్రింట్ లను వదలడంతో ఆ హీరో సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. స్టార్ సినిమాలకు యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న ఈ నెగిటివిటీ సినిమాపై దారుణమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఐతే ఇలానే వదిలేస్తే పరిశ్రమకు మరింత చెడు చేసేలా ఉన్నాయని ఇప్పటికే సినీ పెద్దలకు సంకేతాలు వెళ్లాయి.
ఈ క్రమంలో వీటిని ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. స్టార్ సినిమాల విషయంలో యాంటీ ఫ్యాన్స్ చూపిస్తున్న ఈ అత్యుత్సాహం వల్ల పరిశ్రమ తన మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఐతే పూర్తిగా చేయి దాటి పోక ముందే దీన్ని అడ్డుకట్ట వేయాలని పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు.
ఈ క్రమంలో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో ఎవరి మధ్య కాంపౌండ్ లు లేవని పిలుపునిచ్చారు. సినిమాలు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని అన్నారు. చిరంజీవి తర్వాత లేటెస్ట్ గా అల్లు అరవింద్ కూడా చరణ్ సినిమా గురించి తాను తగ్గించి మాట్లాడానన్న కామెంట్స్ కు ఆన్సర్ ఇస్తూ చరణ్ మేనల్లుడు కాదు కొడుకు లాంటి వాడంటూ ఫ్యాన్స్ ని చల్లబరిచాడు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే స్టార్ హీరోలంతా ఒక్కటై ఫ్యాన్స్ చేస్తున్న ఈ నెగిటివిటీని కంట్రోల్ చేయాలని ఫిక్స్ అయినట్టు ఉన్నారు.
చిరంజీవి, అల్లు అరవింద్ తో మొదలైన ఈ మార్పు మిగతా స్టార్స్ ని కూడా స్పందించేలా చేస్తుందని చెప్పొచ్చు. సినిమాను ప్రేమించి అభిమానించే అభిమాని తన హీరో సినిమాని హిట్టు సూపర్ హిట్ చేయడానికి ఏం చేసినా పర్లేదు కానీ మరో హీరో సినిమాను చంపేయడం లాంటి వ్యవహార శైలి అతను అభిమానించే హీరో కూడా హర్షించే విధంగా ఉండదని చెప్పొచ్చు. దీనిపై ప్రతి హీరో ఎంతో కొంత బాధ్యతగా తమ అభిమానులకు ఒక ప్రకటన రూపంలో హెచ్చరించి పరిశ్రమ బాగు కోసం తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.