మెగాస్టార్ స్వ‌ర్ణోత్స‌వాలకు ఎంత టైమ్ ఉందంటే?

చిరంజీవి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 46 ఏళ్లు పూర్త‌వుతుంది.

Update: 2024-09-25 09:43 GMT

ఇటీవ‌లే న‌ట‌సింహ బాల‌కృష్ణ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా చిత్ర ప‌రిశ్ర‌మ భారీ ఎత్తున ఆయ‌న పేరిట సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌కు ఘ‌నంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌ల‌కు బాల‌య్య త‌రం హీరోలు చిరంజీవి, వెంకటేష్ హాజ‌ర‌వ్వ‌డంతో మ‌రింత శోభాయ‌మ‌నంగా జ‌రిగింది. బాల‌య్య బాల న‌టుడిగా అడుగు పెట్ట‌డంతోనే ఈ ఫీట్ సాధించ‌గ‌లిగారు.

మ‌రి మెగాస్టార్ పేరిట స్వ‌ర్ణోత్స‌వాలు ఎప్పుడు అంటే? అందుకు ఇంకా మ‌రో నాలుగేళ్లు స‌మ‌యం ఉంది. చిరంజీవి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 46 ఏళ్లు పూర్త‌వుతుంది. చిరంజీవి ప్రాణం ఖ‌రీదు సినిమాతో తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. 1978 లో ఈసినిమా రిలీజ్ అయింది. అదే ఏడాది చిరంజీవి మ‌న‌వూరి పాండ‌వులు అనే మ‌రో సినిమా కూడా చేసారు. ఆ ర‌కంగా చిరంజీవి డెబ్యూలుగా రెండు సినిమాలు కూడా చెప్పుకుంటారు.

'మ‌న‌వూరి పాండ‌వులు' చిత్రం తొలి రిలీజ్ గా చెబుతుంటారు. అలా మొద‌లైన చిరంజీవి ప్ర‌స్థానం ఇంత వ‌ర‌కూ 156 సినిమాల వ‌ర‌కూ దారి తీసింది. 156వ చిత్రం 'విశ్వంభ‌ర' ఆన్ సెట్స్లోఉన్న‌సంగ‌తి తెలిసిందే. ల్యాండ్ మార్క్ చిత్రం 150వ సినిమా 'ఖైదీ నెంబ‌ర్ 150' రిలీజ్ అయింది. ఇన్నేళ్ల ప్ర‌యాణంలో చిరంజీవి ఎన్నో అవార్డులు..రివార్డులు అందుకున్నారు. ఈ ఏడాది ప్ర‌తిష్టాత్మ‌క పద్మ‌విభూష‌ణ్ కూడా అందుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లే ఆయ‌న చేసిన సినిమాలు..పాట‌లు..డాన్సుమూవ్ మెంట్ల‌కు గానూ గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుకు ఎక్కారు. నాలుగు ద‌శాబ్ధాల సినీ ప్ర‌యాణంలో ఇలా ఎన్నో విజ‌యాలు ఆయ‌న సాధించారు. ఇండ‌స్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చారు. సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చి దేశం మెచ్చిన లెజెండ్ గా ఎదిగారు. త‌న‌ని తానే స్టార్ గా మార్చుకుని ఎంతో మంది స్పూర్తిగా నిలిచారు. అలాంటి లెజెండ్ పేరిట ఎలాంటి వేడుక‌లు నిర్వ‌హించినా ప్ర‌పంచ‌మే మాట్లాడుకునేలా ఉండాలి.

Tags:    

Similar News