ఆ షాక్ తో మెగా మల్టీస్టారర్ అంటే భయపడుతున్నారా..?

అందుకే అప్పటి నుంచి చిరు తన ఫ్యామిలీ హీరో మల్టీస్టారర్స్ అంటే కాదనేస్తున్నాడు. రీసెంట్ గా చిరు దగ్గరకు ఒక మల్టీస్టారర్ కథ వచ్చిందట.

Update: 2024-02-17 17:30 GMT

స్టార్ హీరో సూపర్ కథతో వస్తే వారికి ఉన్న మాస్ ఫాలోయింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం కామనే. స్టార్ హీరోల సినిమాలకు కొన్నిసార్లు కాంబినేషన్స్ ఎక్కువ ప్రియారిటీ కలిగేలా చేస్తాయి. అయితే వీటితో పాటుగా ఈమధ్య మల్టీ స్టారర్స్ కూడా చేస్తున్నారు. రాజమౌళి వల్ల ఆర్.ఆర్.ఆర్ మల్టీస్టారర్ వచ్చింది. ఈ మెగా నందమూరి కాంబినేషన్ అంచనాలకు తగినట్టుగానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అయితే ఈ మల్టీస్టారర్ తర్వాత మెగా మల్టీస్టారర్ గా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్య సినిమా చేశారు. చిరు, చరణ్ ఇద్దరు కలిసి చేసిన సినిమా అనేసరికి మెగా ఫ్యాన్స్ అంతా ఆ మూవీపై భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక అది డిజాస్టర్ గా మిగిలింది. చిరంజీవి, చరణ్ కలిసి చేసినా ఆచార్య మెగా ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది.

అందుకే అప్పటి నుంచి చిరు తన ఫ్యామిలీ హీరో మల్టీస్టారర్స్ అంటే కాదనేస్తున్నాడు. రీసెంట్ గా చిరు దగ్గరకు ఒక మల్టీస్టారర్ కథ వచ్చిందట. కథ డిమాండ్ మేరకు అందులో చిరుతో పాటు రామ్ చరణ్ లేదా పవన్ కళ్యాణ్ అయినా చేసే అవకాశం ఉందట. చిరుకి కూడా లైన్ ఓకే అనిపించిందట. కానీ ఆచార్య ఇచ్చిన షాక్ వల్ల చిరు ఆ మల్టీస్టారర్ పై అంతగా ఆసక్తి చూపించట్లేదని టాక్.

ఇద్దరు మెగా హీరోలు కలిసి చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటే అవి కాస్త నిరాశ పరుస్తున్నాయి. ఆచార్య మాత్రమే కాదు లాస్ట్ ఇయర్ వచ్చిన బ్రో సినిమా కూడా మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. అందుకే చిరు, చరణ్, పవన్ ఇలా ఈ కాంబో మల్టీస్టారర్ కథలు తన దగ్గరకు వస్తున్నా చిరంజీవి వాటిని పక్కన పెడుతున్నాడని తెలుస్తుంది. మెగా మల్టీస్టారర్ కుదరడం అంటూ జరిగితే అది మెగా బ్లాక్ బస్టర్ టార్గెట్ తో చేయాలని మెగాస్టార్ ప్లానింగ్ తో ఉన్నారు. మరి అది ఎప్పటికి జరుగుతుందో చూడాలి. ఆచార్య ఫ్లాప్ అది ఎవరి వల్ల అన్నది పక్కన పెడితే చిరు చరణ్ కలిసి మరో మల్టీస్టారర్ చేయాలన్న మెగా ఫ్యాన్స్ కోరికని మెగా కాంపౌండ్ తోసి పుచ్చుతుంది. ఇక మీదట అలాంటి మల్టీస్టారర్ చేసే ఛాన్స్ లేదని చెప్పేస్తున్నారట.

Tags:    

Similar News