గ్రాండ్ మెగా పార్టీ.. స్పెషల్ మూమెంట్ వైరల్

అయితే తన మామయ్యకు అత్యున్నత పురస్కారం వరించిన సందర్భంగా మెగా కోడలు ఉపాసన తన నివాసంలో గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన తెలిసిందే.

Update: 2024-02-05 04:44 GMT

మెగాస్టార్ చిరంజీవి.. హీరోగానే కాదు వ్యక్తిత్వం లోనూ నెంబర్ వన్. ఆ విషయం ఇప్పుడు దేశానికి మరోసారి తెలిసింది! ఇటీవలే చిరుకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ తో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం మెగాస్టార్‌ కు వచ్చిందని తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులెందరో ఆయనను అభినందించారు.. అభినందిస్తూనే ఉన్నారు. స్వయంగా ఇంటికి వెళ్లి మరీ విషెస్ చెబుతున్నారు.

ఇక సినీ రాజకీయ ప్రముఖులే ఇంత సందడి చేస్తుంటే.. చిరు ఇంట్లో వాతావరణం ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి! పద్మవిభూషణ్ ప్రకటించిన తర్వాత భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన ఫుల్ ఖుషీ అయ్యారట. ఇక అల్లు అర్జున్ సహా మెగా హీరోలంతా తమ ప్రియమైన అంకుల్ దగ్గరకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు.

అయితే తన మామయ్యకు అత్యున్నత పురస్కారం వరించిన సందర్భంగా మెగా కోడలు ఉపాసన తన నివాసంలో గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన తెలిసిందే. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరైనట్లు కూడా ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే ఈ పార్టీ తన అమ్మానాన్న శోభన కామినేని, అనిల్ కామినేని ఏర్పాటు చేసినట్లు ఉపాసన ఇన్ స్టాలో తెలిపారు. ఒక మరపురాని సాయంత్రం అంటూ పార్టీ ఫొటోలను షేర్ చేశారు. సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ జరగడం ఎంతో గర్వంగా ఉన్నట్లు చెప్పారు.


ఉపాసన పోస్ట్ చేసిన ఫొటోల్లో చిరుతోపాటు చరణ్.. స్టైలిష్ బ్లాక్ ఔట్ ఫిట్స్ లో కనిపించారు. ఉపాసన డీసెంట్ లాంగ్ డ్రెస్ లో మెరిశారు. చిరు నటించిన సినిమాల పోస్టర్స్ తో తయారు చేసిన స్పెషల్ కేక్ ను కట్ చేశారు చిరంజీవి. మెగాస్టార్ కు అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని, హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ రేవంత్ రెడ్డి చిరుకు విషస్ తెలిపారు. తనను అభినందించిన ముఖ్యమంత్రికి చిరంజీవి ధన్యవాదాలు చెప్పారు.

ఇక నిన్న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో తెలంగాణ ప్రభుత్వం.. మెగాస్టార్ చిరంజీవి సహా పద్మ విజేతలను ఘనంగా సత్కరించింది. టాలీవుడ్ ప్రముఖులు కూడా త్వరలోనే భారీ అభినందన సభ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ సెట్స్ లోకి చిరు ఇటీవలే ఎంట్రీ ఇచ్చారు.

 

Tags:    

Similar News