ప‌వ‌న్ మ్యాన‌రిజ‌మ్ లో చిరంజీవి..ఏదో ఉందే!

ఇంత‌కాలం లేని ఐడియా కొత్త‌గా ఇప్పుడే ఎందుకు వ‌చ్చిన‌ట్లు

Update: 2023-07-17 11:58 GMT

మెగాస్టార్ చిరంజీవి మ్యాన‌రిజ‌మ్ ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా సినిమాల్లో అనుక‌రించారు. రప్ఫాడించేస్తా..చేయి చూసావా? ఎంత ర‌ఫ్ గా ఉందో? అంటూ కొన్ని డైలాగులు చిరు మ్యాన‌రిజంతో చెప్పిన సంద‌ర్భా లున్నాయి. సొంత అన్న‌య్య సినిమా లో డైలాగులు కాబ‌ట్టి ప‌వ‌న్ త‌న‌క‌నుగుణంగా వినియోగించుకునేవారు.

మ‌రి చిరంజీవి ఎప్పుడైనా ప‌వ‌న్ మ్యాన‌రిజ‌మ్ ని అనుక‌రించారా? అలాంటి ప్ర‌య‌త్నం ఇన్నేళ్ల జ‌ర్నీలో ఏనాడైనా జ‌రిగిందా? పీకే డైలాగ్ లు ప‌ట్టే ప్ర‌య‌త్నం చేసారా? అంటే లేద‌నే చెప్పాలి. కానీ భోళాశంక‌ర్ సినిమా లో తాజాగా చిరు ఓ మెగా పవర్ వీడియోను లీక్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇందులో చిరంజీవి -పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేస్తున్నట్లు గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ లీక్ లో కనిపించేది చిన్న‌దే అయినా సినిమా లో పవన్ అభిమానులకు పూన‌కం తెప్పించే స‌న్నివేశం అది. ఆ స‌న్నివేశానికి థియేటర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా షేకైపోతుంది. చిరు..ప‌వ‌న్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. త‌మ్ముడు మ్యాన‌రిజ‌మ్ ని అన్న‌య్య ఇర‌గ‌దీసాడంటూ సంబ‌ర‌ప‌డుతున్నారు.

ఈ సంగ‌తింకా ప‌వ‌న్ కి తెలిసిందో? లేదో తెలియ‌దు. తెలిస్తే ఆయ‌న అంతే ఉత్సాహంగా స్పందిస్తారు. మ‌రి త‌మ్ముడు మ్యాన‌రిజ‌మ్ ని చిరు ఇప్పుడే ఎందుకు అనుక‌రించినట్లు? ఇంత‌కాలం లేని ఐడియా కొత్త‌గా ఇప్పుడే ఎందుకు వ‌చ్చిన‌ట్లు? అంటూ కొంత మంది లో కొన్ని సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇందులో ఏదైనా పొలిటిక‌ల్ ఎజెండా ఉందా? అంటూ రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేస్తున్నాయి.

సాధార‌ణంగా చిరంజీవి గురించి ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎక్కువ‌గా మాట్లాడుతుంటారు. చిరు ని తండ్రిగా..అన్న‌య్య‌గా..ఫిలాస‌ఫ‌ర్ గా భావిస్తున్న‌ట్లు..ఆయ‌న గురువుగా చెబుతుంటారు. చిరుకి సంబంధించి ఏ ఈవెంట్ కి పీకే వ‌చ్చిన ఆ మాట‌లు త‌ప్పక ఉంటాయి.

ఇక ప‌వ‌న్ గురించి చిరంజీవి చాలాత‌క్కువ‌గానే మాట్లాడిన సంద‌ర్భాలున్నాయి. త‌న క‌మిట్ మెంట్ ఎలా ఉంటుంది. వ్య‌క్తిగ‌తంగా తాను ఎలా ఉంటాడు? వంటి విష‌యాలు సింపుల్ గా చెప్పి తేల్చేస్తారు. కానీ ఇప్పుడో సినిమా లో పీకేనే అనుక‌రించ‌డం అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News