జానీ గొడవ.. స్వర్ణ మాస్టర్ ఏమన్నారంటే?

జానీతో పాటు సదరు బాధితురాలితో తనకు పరిచయం లేదని చెబుతూనే.. ఈ వ్యవహారం మీద తన అభిప్రాయాన్ని ఆమె వెల్లడించారు.

Update: 2024-09-20 04:08 GMT

ప్రస్తుతం టాలీవుడ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారిన అంశం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద తన మాజీ అసిస్టెంట్ చేసిన లైంగిక వేధింపులు ఆరోపణలే. ఆరేళ్లుగా తనను జానీ ఎలా వేధించింది.. తనపై లైంగిక దాడికి పాల్పడింది.. తన నుంచి దూరమయ్యాక పని దక్కకుండా చేసింది వివరిస్తూ ఆమె అనేక ఆరోపణలు చేసింది. బాధితురాలికి ఇండస్ట్రీ నుంచి గట్టి తోడ్పాటే లభించింది. పోలీసులు కూడా సత్వరం స్పందించి జానీ మీద కేసులు నమోదు చేశారు. తాజాగా అతణ్ని అరెస్ట్ చేశారు కూడా. ఇలాంటి సందర్భంలో సీనియర్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై స్పందించారు. జానీతో పాటు సదరు బాధితురాలితో తనకు పరిచయం లేదని చెబుతూనే.. ఈ వ్యవహారం మీద తన అభిప్రాయాన్ని ఆమె వెల్లడించారు.

‘‘వాళ్లిద్దరితోనూ నాకు పరిచయం లేదు. ఎవ్వరూ నాకు క్లోజ్ కాదు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. జానీ ఏం చేసినా.. దాన్ని నేను సమర్థించను. కానీ ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసి, కేసులు పెట్టడానికి ఎంచుకున్న టైమింగ్ నాకు కరెక్ట్ అనిపించడం లేదు. ఆరేళ్లుగా అతను ఆమెను వేధిస్తుంటే ఎందుకు సైలెంట్‌గా భరిస్తూ వచ్చింది అన్నది నా అనుమానం. మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే ఒకరు గట్టిగా అరవగానే చుట్టు పక్కల వాళ్లు పరిగెత్తుకుని వస్తారు. ఒక అమ్మాయిని ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తుంటే సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని అరిచి చెప్పాలి. గొడవ చేయాలి. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్లు ఊరుకోరు. బాధితురాలు ఆ పని ఎందుకు చేయలేదు? ఇన్నేళ్ల పాటు మౌనంగా ఉండి.. ఇప్పుడు వచ్చి ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం ఎందుకు చేస్తోంది అన్నది నాకు అర్థం కాని విషయం. నేను జానీకి మద్దతుగా మాట్లాడట్లేదు. తనన సమర్థించను. కానీ ఆ అమ్మాయి ఉద్దేశాల మీద నాకు అనుమానం ఉంది’’ అని స్వర్ణ మాస్టర్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Tags:    

Similar News