క్రిస్మస్ సీజన్ `సలార్`దేనా?
నిజానికి క్రిస్మస్ సీజన్ లో అత్యంత భారీ హైప్ తో దూసుకొచ్చిన సలార్ కి డంకీ- ఆక్వామేన్ 2 చిత్రాల నుంచి ఎలాంటి ముప్పు ఉంటుందోనంటూ కొంత ఆందోళన నెలకొంది.
నిజానికి క్రిస్మస్ సీజన్ లో అత్యంత భారీ హైప్ తో దూసుకొచ్చిన సలార్ కి డంకీ- ఆక్వామేన్ 2 చిత్రాల నుంచి ఎలాంటి ముప్పు ఉంటుందోనంటూ కొంత ఆందోళన నెలకొంది. కానీ ఇప్పుడు అన్ని సందేహాలకు సమాధానం లభించింది. డంకీ చిత్రం మిశ్రమ స్పందనలతో స్టార్టయింది. అయితే ఎన్నో అంచనాల నడుమ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హాలీవుడ్ భారీ చిత్రం ఆక్వామేన్ 2 తీవ్రంగా నిరాశపరిచిందని టాక్ వచ్చింది. సమీక్షకులు ఈ సినిమా విషయంలో పెదవి విరిచేసారు. దీనిని భారతదేశంలోను చెప్పుకోదగ్గ థియేటర్లలో విడుదల చేసారు. కానీ సముద్రపుత్రుని ఆటలు సాగలేదని, సినిమా బోర్ కొట్టిందని చాలా మంది సమీక్షించారు.
అయితే డంకీ- ఆక్వామేన్ 2 చిత్రాల ఫలితం గురించి తెలియగానే ఇక సలార్ రిజల్ట్ ఎలా ఉండనుందో తెలుసుకోవాలన్న కుతూహాలం పెరిగింది. ఈ శుక్రవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా ప్రదర్శితమవుతున్న సలార్ పై అత్యంత భారీ హైప్ నెలకొంది. డార్లింగ్ ప్రభాస్ భారీ ఓపెనింగుల రికార్డులను అందుకుంటాడని అంచనా ఉంది. అయితే డంకీ, ఆక్వామేన్ 2 తో థియేటర్ల సర్ధుబాటు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చిన సంగతి తెలిసిందే. ఏదేమైనా కానీ సలార్ కి వచ్చిన టాక్ ని బట్టి, పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని బట్టి బాక్సాఫీస్ రిపోర్ట్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న టాక్ అందుకుంటే ఇక ప్రభాస్ మానియా ముందు ఇతరులు నిలబడలేరన్నది సత్యం.
ఒక స్నేహితుడికి అండగా నిలిచే వీరుని కథే సలార్. కానీ శత్రుత్వం ఎట్నుంచి ఎలా పుట్టుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ థీమ్ ఎంతో అద్భుతమైనది. భారీ యాక్షన్ థ్రిల్స్ కి ఆస్కారం ఉన్న సినిమా. అందుకే డంకీ కానీ, ఆక్వామేన్ 2 కానీ ఎదురు నిలవలేవని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే అంతంత మాత్రమేనని టాక్ తెచ్చుకున్న డంకీతో , ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆక్వామేన్ 2తో సలార్ కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయితే ఈ సినిమాకి తొలి రోజు ఫీడ్ బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఇది బావుంది.. హిట్టయింది అన్న టాక్ వచ్చినా చాలు .. ప్రభాస్ మానియాతో తొలి వీకెండ్ భారీ వసూళ్లకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈనెల 29 వరకూ క్రిస్మస్ సుదీర్ఘ సెలవులను ఎన్ క్యాష్ చేసుకునేందుకు సలార్ కి ఆస్కారం ఉంటుంది.