చుట్టమల్లే ఇంగ్లీష్ వెర్షన్… ఓ లుక్కేయండి

పాటలోనే మొదటి పల్లవి తెలుగులోనే ఆలపించగా తరువాత చరణం అంతా ఇంగ్లీష్ లో ఉంది. హాలీవుడ్ పాప్ సాంగ్స్ తరహాలో ఈ పాటని డిజైన్ చేశారు.

Update: 2024-10-12 06:44 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలోని చుట్టమల్లే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ‘దేవర’ నుంచి సెకండ్ సింగిల్ గా ఈ పాటని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి ఆరంభంలో కాపీ ట్యూన్ అంటూ విమర్శలు వచ్చాయి. అయిన కూడా ఈ సాంగ్ కి మంచి ఆదరణ లభించింది. తక్కువ టైంలోనే 100 మిలియన్ వ్యూస్ ని ఈ సాంగ్ సొంతం చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలో షార్ట్స్ ద్వారా ఈ సాంగ్ విపరీతంగా వైరల్ అయ్యింది.

ఈ పాటలో జాన్వీ కపూర్ గ్లామర్ కూడా ఆడియన్స్ ని కట్టిపడేసింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఈ చుట్టమల్లే సాంగ్ విపరీతంగా నచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సాంగ్ ఇంగ్లీష్ వెర్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది ఔత్సాహికులు చుట్టమల్లే సాంగ్ ఇంగ్లీష్ వెర్షన్ వీడియోని తెరకెక్కించారు. దీనిలో ఇద్దరు ఫారినర్స్ ని లీడ్ పెయిర్ గా తీసుకొని వీడియో షూట్ చేయడం విశేషం.

పాటలోనే మొదటి పల్లవి తెలుగులోనే ఆలపించగా తరువాత చరణం అంతా ఇంగ్లీష్ లో ఉంది. హాలీవుడ్ పాప్ సాంగ్స్ తరహాలో ఈ పాటని డిజైన్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ సాంగ్ ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ స్టామినా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు సాంగ్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో విదేశీయులు ఇండియన్ సాంగ్స్ కి డాన్స్ లు చేస్తున్నారు.

లేదంటే వారి భాషలో పాటని ట్రాన్స్ లేట్ చేసి యుట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకొని ప్రాఫిట్ లోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. 500 కోట్ల దిశగా ఈ మూవీ కలెక్షన్స్ దూసుకుపోతున్నాయి.

ఎన్టీఆర్ కెరియర్ లోనే సోలోగా హైయెస్ట్ కలెక్షన్స్ ఈ చిత్రానికి వచ్చాయి. దేవర మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో నెక్స్ట్ ‘దేవర’ పార్ట్ 2పైన అంచనాలు పెరిగాయి. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ డిసెంబర్ లో మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మూవీ షూటింగ్ మొదలు కావొచ్చని అనుకుంటున్నారు.

Full View
Tags:    

Similar News