కంగ‌న‌ను చెంప దెబ్బ కొట్టిన మ‌హిళ‌.. కార‌ణ‌మిదే!

కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన తర్వాత త‌న‌ను ప్రశ్నించిన కానిస్టేబుల్ రెచ్చిపోయిన మరో వీడియో కూడా వైరల్‌గా మారింది.

Update: 2024-06-06 17:52 GMT

కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గురువారం ఢిల్లీకి వెళ్తుండగా చండీగఢ్ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)కి చెందిన మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టింది. 'ఖలిస్తానీ' వ్యాఖ్యలకు కంగనా రనౌత్‌పై ఆరోపణలు వచ్చిన సంగ‌తి తెలిసిందే. చండీగఢ్ విమానాశ్రయంలో చెంపదెబ్బ ఘటన తర్వాత కంగనా రనౌత్ గొడవకు దిగిన వీడియోలు గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన తర్వాత త‌న‌ను ప్రశ్నించిన కానిస్టేబుల్ రెచ్చిపోయిన మరో వీడియో కూడా వైరల్‌గా మారింది.

ఈ ఘ‌ట‌న అనంత‌రం చెంప దెబ్బ కొట్టిన‌ కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్‌ను సంబంధిత శాఖ‌ సస్పెండ్ చేసింది. CISF అధికారుల లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా చండీగఢ్ విమానాశ్రయంలో CISF కానిస్టేబుల్‌పై FIR నమోదు అయింది. సీఐఎస్ఎఫ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

అయితే ఈ చెంప దెబ్బ‌కు కార‌ణ‌మేమిటి? అని ఆరా తీస్తే.. బీజేపీ నాయకురాలు, నటి కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఇలా అన్నారు. రూ. 100 కోసం రైతులు అక్కడ కూర్చున్నారని కంగ‌న‌ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాము వెళ్లి అక్కడ కూర్చుంటావా? ఆమె ఈ స్టేట్‌మెంట్ ఇచ్చేటప్పుడు మా అమ్మ అక్కడ కూర్చుని నిరసన వ్యక్తం చేసింది.. అందుకే కోపంతో కొట్టాను! అని తన‌లో దాగి ఉన్న ఆవేద‌న‌ను స‌ద‌రు కానిస్టేబుల్ బ‌హిర్గ‌తం చేసింది.

కంగ‌న X లో పోస్ట్ చేసిన నోట్ లో పంజాబ్‌లో తీవ్రవాదం హింస దిగ్భ్రాంతికరంగా పెరిగింది! అని వ్యాఖ్యానించారు. తాను సురక్షితంగానే ఉన్నాన‌ని, అయితే పంజాబ్‌లో పెరుగుతున్న ఉగ్రవాదం గురించి ఆందోళన చెందుతున్నట్లు కంగ‌న‌ పేర్కొంది. ఢిల్లీలో దిగిన తర్వాత ప్రకటన విడుదల చేసిన రనౌత్, ఒక‌ పక్క నుంచి కానిస్టేబుల్ తన వైపు వచ్చింద‌ని చెప్పారు. ''నా ముఖం మీద కొట్టి నన్ను దుర్భాషలాడడం ప్రారంభించింది. ఆమె ఎందుకు అలా చేసిందో అడిగాను. రైతుల నిరసనలకు తాను మద్దతు ఇస్తున్నట్లు చెప్పింది'' అని కంగ‌న తెలిపింది.

Tags:    

Similar News