చరణ్-తారక్ లెక్క సరిపోయిందిలా?
దీంతో యంగ్ టైగర్ పై అభిమానులే అసహనం వ్యక్తం చేసారు. చరణ్ కొత్త సినిమా మొదలు పెట్టినా? మా హీరో మాత్రం కామ్ గా ఉన్నాడు?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ లెక్క సరిపోయిందా? ఈ విషయంలో ఇద్దరి హీరోల అభిమానులు ఒకే రకమైన అభిప్రాయంతో ఉన్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే 'ఆర్ ఆర్ ఆర్' సెట్స్ లో ఉండగానే రామ్ చరణ్ ...శంకర్ ని లైన్ లోపెట్టి 'గేమ్ ఛేంజర్' లాక్ చేసిన సంగతి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' నుంచి బయటకు రాగానే శంకర్ తో సినిమాని చరణ్ పట్టాలెక్కించాడు.
దీంతో తారక్ అభిమానులకు టార్గెట్ అయ్యారు. కొరటాల శివతో తారక్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి ఎంత సమయం పట్టిందో తెలిసిందే. స్టోరీ విషయంలో రకరకాల తర్జనభర్జలను ముగించి ప్రారంభించడానికి నెలల సమయం పట్టింది. దీంతో యంగ్ టైగర్ పై అభిమానులే అసహనం వ్యక్తం చేసారు. చరణ్ కొత్త సినిమా మొదలు పెట్టినా? మా హీరో మాత్రం కామ్ గా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకింత సమయం తీసుకుంటున్నాడు? అని ఒకటే విమర్శ తెరపైకి వచ్చింది.
సహనం కోల్పోయిన నెటి జనులు తారక్-శివని ఏకంగా ట్రోలింగ్ సైతం చేసారు. ఆరకంగా అభిమానుల నుంచి ఎప్పుడూ ఎదురుకాని ప్రతికూల సన్నివేశాన్ని తారక్ తొలిసారి చూసాడు. అయితే చరణ్ -శంకర్ ప్రాజెక్ట్ డిలేతో ఆ లెక్క బ్యాలెన్స్ అయినట్లే. ఎందుకంటే అప్పుడెప్పుడో పట్టాలెక్కించిన 'గేమ్ ఛేంజర్' ఇంతవరకూ రిలీజ్ కాలేదు. ఇంకా షూటింగ్ కూడా పూర్తికాలేదు. ఈలోపు 'దేవర' మొదటి పార్టు షూటింగ్ కూడా క్లైమాక్స్ కి వచ్చేసింది.
మహా అయితే 'గేమ్ ఛేంజర్' కంటే 'దేవర' మరో రెండు నెలలు అదనంగా షూటింగ్ కి సమయం తీసుకొవచ్చు. కానీ రిలీజ్ పరంగా చూస్తే 'గేమ్ ఛేంజర్' కంటే దేవర ముందుగా రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని దిల్ రాజు చెప్పేసారు. 'దేవర' ఇంకా డేట్ ఇవ్వలేదు. అక్టోబర్ అనుకుంటున్నారు. కానీ అప్పటికి రెడీ అవుతుందా? లేదా? అన్నది చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఆనెల దాటిందంటే? డిసెంబర్ కి మారే అవకాశం లేకపోలేదు. అందుకే అంటారు ముందు వెనకాయేను. వెనుక ముందాయేను అని.