ధైర్యం ఉంటే ముందుకు రా.. ఆ మాటకు అరియానా ఫైర్

వివరాళ్లోకి వెళితే.. బిగ్ బాస్ మాజీ హాట్ బ్యూటీ అరియానా గ్లోరీ.. సోషల్ మీడియా ఫాలోవర్స్​కు, బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా తెలుసు

Update: 2023-10-10 07:20 GMT

బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ ట్రోలర్స్​పై విరుచుకుపడింది. గత వారం రోజులుగా తనపై, తన పెర్సనాలిటీ పై వస్తున్న కామెంట్స్, ట్రోల్స్​కు సోషల్ మీడియా వేదికగా గట్టి సమాధానం ఇచ్చింది. పనికిమాలిన వేస్ట్​ ఫెలోస్ అంటూ రెచ్చిపోయింది. ప్రస్తుతం అరియానా మాట్లాడిన ఈ వీడియోలో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వివరాళ్లోకి వెళితే.. బిగ్ బాస్ మాజీ హాట్ బ్యూటీ అరియానా గ్లోరీ.. సోషల్ మీడియా ఫాలోవర్స్​కు, బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా తెలుసు. ఈ అమ్మడు తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్​గా మారిపోయింది.

తన క్యూట్ వాయిస్​తో బుల్లితెరపై పలు షోలల్లో యాంకర్​గా దూసుకుపోతోంది. ఆ మధ్యలో కాంట్రవర్సీ డైరెక్టర్​ ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూల్లో పాల్గొని బోల్డ్ పబ్లిసిటీ అందుకుంది. అనంతరం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో వరుస బోల్డ్​ ఫోటో షూట్స్​తో క్రేజ్ పెంచుకోవడం ప్రారంభించింది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ.. తన ఘాటు అందాలను హైలెట్ చేస్తోంది.

ఈ క్రమంలోనే బొద్దుగా మారి తన సొగసుతో కుర్రాళ్ళకు వల వేసింది. దీంతో ఆమె శరీరంపై పలు రకాల కామెంట్స్ వచ్చాయి. దీంతో రీసెంట్​గా నాజూకుగా తయరైంది. కానీ మళ్లీ ఇప్పుడు బొద్దుగా మారి ఆంటీ అంటూ ట్రోల్స్​ను ఎదుర్కొంటోంది. అయితే తాజాగా వాటిపై స్పదించింది అరియానా.

పనీపాటా లేని వేస్ట్ ఫెలోస్ కోసమే ఇది. సన్నగా ఉన్నప్పుడు ఏంటి ఇంత సన్నగా ఉన్నావ్ అన్నారు. లావు అయితే ఏంటి లావయ్యావ్ ఆంటీలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తారు. అసలు నువ్వు ఎలా ఉంటావ్​?.. నేను ఎలా ఉంటె నీకు ఎందుకురా.. ధైర్యంగా ఒక పోస్ట్ పెట్టు. నన్ను చూడటం నీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే.. అన్ ఫాలో చెయ్. కనీసం నా లైఫ్ లో నేను ప్రోగ్రస్ అయినా అవుతున్నాను. నువ్వేం చేస్తున్నావ్ రా.. ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడరా. ఆలోచించి మాట్లాడరా.. పని పాట లేకపోతే పని చూసుకో.. అంటూ ట్రోలర్​పై అరయానా విరుచుకుపడింది.

Tags:    

Similar News