ప్ర‌భాస్ KALKIతో GOAT క‌నెక్ష‌న్?

వెంకట్ ప్రభు- ద‌ళ‌పతి విజయ్‌ల కలయికలో మొదటి సినిమా ఇది.

Update: 2024-04-07 09:44 GMT
ప్ర‌భాస్ KALKIతో GOAT క‌నెక్ష‌న్?
  • whatsapp icon

ఇల‌య‌దళపతి విజయ్ న‌టిస్తున్న తాజా చిత్రం GOAT 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ ప్రభు- ద‌ళ‌పతి విజయ్‌ల కలయికలో మొదటి సినిమా ఇది. ఈ చిత్రంలో మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, జయరామ్, మీనాక్షి చౌదరి, యోగి బాబు త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో రూపొందిస్తున్న‌ చిత్రమిద‌ని ప్రచారం ఇప్ప‌టికే ఉంది. ఒకవేళ ఇదే నిజ‌మైతే సౌతిండియాలో ఇద్ద‌రు పెద్ద స్టార్ హీరోలు ఒకేసారి రెండు భారీ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాల‌తో దూసుకు రాబోతున్నారు. ఇవి రెండూ రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయం. అలాగే క‌ల్కిలో ప్ర‌భాస్ డ్యూయ‌ల్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తార‌ని ప్ర‌చారం ఉంది. కానీ అధికారికంగా క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. కానీ ది గోట్ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నార‌నేది టాక్‌. ఒక పాత్ర‌లో 19 ఏళ్ల యువకుడిగా .. మరొక పాత్ర‌లో ఏజ్డ్ ప‌ర్స‌న్ గా క‌నిపిస్తాడు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది.

కొత్త షెడ్యూల్ రష్యాలో

తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా కొత్త షెడ్యూల్ ర‌ష్యాలో ప్రారంభ‌మైంది. నిర్మాత అర్చన కల్పాతి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ షెడ్యూల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, VTV గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి S అఘోరమ్, కల్పాతి S గణేష్, కల్పాతి S సురేష్‌లు నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News