హీరోకి ఇంటి భోజనం కోర్టు తేల్చేసిందిలా?
ఇంటి భోజనం విషయంలో అధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం లేదని దర్శన్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే దర్శన్ కి మద్దతుగా మాజీ ఖైదీ సిద్దూరడ స్పందించాడు.
పరప్పన్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ ఇంటి భోజనం కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పిటీషన్ పై బుధవారం విచారణ జరిగింది. 10 రోజుల్లో అర్జీపై జైలు అధికారులు తమ నిర్ణయం చెప్పాల్సిందిగా ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనానికి అనుమతి ఉందని జడ్జి అధికారులకు గుర్తు చేసారు. పిటీషనర్ కి పౌష్టికాహార అవసరం ఉందని చెప్పి ఆగస్టు 20కి వాయిదా వేసింది.
ఇంటి భోజనం విషయంలో దర్శన్ జైలు అధికారుల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టులోనే పిటీషన్ దాఖలు చేసారు. తమని సంప్రదించకుండా పిటీషన్ వేయడం తో అధికారులు గతంలోనే స్పందించారు. దర్శన్ కి అన్నిరకాల పౌష్టికాహారం జైలులో అందిస్తున్నామని ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పే ప్రయత్నం చేసారు. తాజాగా కోర్టు జైలు అధికారుల్ని ఆదేశించడంతో సమాధానం చెప్పాల్సిన అవసరం అధికారులపై ఉంది.
ఇంటి భోజనం విషయంలో అధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం లేదని దర్శన్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే దర్శన్ కి మద్దతుగా మాజీ ఖైదీ సిద్దూరడ స్పందించాడు. దర్శన్ కి టీవీతో పాటు విఐపీ సౌకర్యాలు కల్పంచాలని కోరాడు. తాను జైల్లో దర్శన్ కి యోగా నేర్పించానని, అక్కడ సకల సౌకర్యాలు అందుతున్నాయని అన్నాడు. సిద్దూరూడ సత్ప్రవర్తన కింద విడుదలై ఈ వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ అతడిపై పోలీసులు అరెస్ట్ కి సిద్దమవుతున్నట్లు సమాచారం.
అలాగే మరో నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ జైలులో భోజనం బాగుంటుందని, దర్శన్ కి ఎందుకు నచ్చడంలేదోనని వ్యాఖ్యానించారు. తాను జైలులో ఉండగా తన కుటుంబ సభ్యులెవర్నీ లోపలికి అనుమతించలేదన్నారు. తొలిసారి ఆరుగురితోపాటు ఒకే సెల్ లోఉంచారని, రెండవ సారి జైలుకెళ్లినప్పుడు 40 మంది ఉన్న బ్యారెక్స్ లో ఉచారన్నారు.