నటుడి DNA పరీక్షకు కోర్టు నో!
1996 లో రవికిషన్ తో వివాహం జరిగిందని 15 ఏళ్ల కుమార్తె కూడా ఉందని ఆరోపించింది.
భోజ్ పురీ నటుడు ఎన్నికలకు సిద్దమవుతోన్న వేళ నేను రెండవ భార్యనంటూ అపర్ణా ఠాకూర్ అనే మహిళ మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. 1996 లో రవికిషన్ తో వివాహం జరిగిందని 15 ఏళ్ల కుమార్తె కూడా ఉందని ఆరోపించింది. ఇప్పటికీ రవికిషన్ తమ రిలేషన్ షిప్ లో ఉన్నాడని మీడియా సమావేశంలో తెలిపింది. అయితే 15 ఏళ్లు వయసు వచ్చే వరకూ రవికిషన్ తనకు తండ్రి అన్న విషయం తెలియదని..అంకుల్ అని పిలిచేదాన్ని అని..ఆయన కుటుంబాన్ని కూడా తాను కలిసానని... తండ్రిగా తన దగ్గరకు ఎప్పుడూ రాలేదని.. తనని కుమార్తెగా స్వీకరించాలని కోరింది.
దీంతో రవికిషన్ నామినేషన్ కి ముందే చిక్కుల్లో పడ్డట్లు అయింది. ఈ నేపథ్యంలో అవన్నీ అవాస్తవాలు అంటూ తమ ప్రతిష్టను దెబ్బతియాలేని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని రవికిషన్ భార్య మీడియా ముందుకొచ్చారు. దానికి సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఫైల్ చేసారు. ఈ నేపథ్యంలో షినావో డీఎన్ ఏ పరీక్ష చేయాలంటూ ముంబై కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే తాజాగా షివానో వాదనని కోర్టు తోసిపుచ్చింది.
కొన్ని రోజుల క్రితం షినావో తల్లి అపర్ణా సోనీ మీడియా సమావేశం అనంతరం డీఎన్ ఏ పరీక్ష కోసం కోర్టుకు వెళ్లారు. ఈ పిటీషన్ పై వాదనలు వినిపిస్తూ తన తండ్రి అయినా అంకుల్ అని పిలిచేదాన్ని అని వాదించారు. దీంతో నటుడు తరుపు న్యాయవాది అపర్ణకి- రవి కిషన్ కి ఎలాంటి శారీరక సంబంధం లేదని..పరిచయం ముందు నుంచి ఉన్నప్పటికీ అది కేవలం స్నేహపూర్వకమైందని వాదించారు. కానీ షినోవా లాయర్ మాత్రం అందుకు భిన్నమైన వాదనులు వినిపించారు. దీంతో తాత్కాలికంగా రవికిషన్ కి ఈ కేసు నుంచి ఉపశమనం లభించినట్లు అయింది.
ప్రస్తుతం రవి కిషన్ సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ తరుపున పోటీ చేసి గెలిచారు. అదే నమ్మకంతో ఈసారి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఇతర భాషల కంటే ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేస్తున్నారు. `రేసు గుర్రం` తర్వాత తెలుగు లో మళ్లీ అవకాశాలు రాలేదు. ఆయన చివరిగా టాలీవుడ్ లో `హీరో` అనే చిత్రంలో నటించారు.