CTRL ట్రైలర్ … అనన్య పాండే సైబర్ థ్రిల్లర్

విక్రమాదిత్య మొత్వానే దర్శకత్వంలో ఈ సైబర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది.

Update: 2024-09-25 06:06 GMT

హిందీలో ఈ మధ్యకాలంలో కొన్ని ఇంటరెస్టింగ్ కథలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని మేకర్స్ ప్రెజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే కథలతో వస్తున్నారు. ఓటీటీలలో అలాంటి ట్రెండింగ్ కథలకి మంచి ఆదరణ లభిస్తోంది. అనన్య పాండే, విహాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘CTRL’ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విక్రమాదిత్య మొత్వానే దర్శకత్వంలో ఈ సైబర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ఇందులో అనన్య పాండే ‘CTRL’ అనే ఒక యాప్ డౌన్ లోడ్ చేసి అందులో ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది. తన జీవితం మీద కంట్రోల్ ని ఆ యాప్ కి ఇస్తుంది. అందులో విహాన్ తో ఆమె లవ్ జర్నీ మొత్తం రిప్రజెంట్ అవుతుంది. మెల్లగా అనన్య పాండే జీవితం నుంచి విహాన్, అతని జ్ఞాపకాలని యాప్ ద్వారా చెరిపేస్తుంది.

తరువాత సడెన్ గా విహాన్ కనిపించడం లేదని అనన్యకి మరో ఫ్రెండ్ వీడియో కాల్ లో చెబుతుంది. అక్కడి నుంచి కథని ఇంటరెస్టింగ్ గా నడిపించే ప్రయత్నం చేశారు. అసలు విహాన్ ఏమయ్యాడు. ‘CTRL’ యాప్ కి విహాన్ మిస్సింగ్ కి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కథని దర్శకుడు చెప్పబోతున్నట్లు ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. విక్రమాదిత్య గత సినిమాలు మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో కచ్చితంగా ‘CTRL’ మూవీ కూడా మెప్పిస్తుందని ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో సరికొత్త కథాంశంతో ‘CTRL’ సినిమా ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. అనన్య పాండే ఇప్పటికే ‘కాల్ మీ బే’ అనే వెబ్ సిరీస్ నటించింది. ఇందులో కూడా విహాన్ అనన్యకి జోడీగా నటించాడు. మరోసారి వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఈ డిజిటల్ మూవీ అక్టోబర్ 4న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది వేచి చూడాలి.

ఈ చిత్రాన్ని నిఖిల్ ద్వివేది, ఆర్య కె మీనన్ నిర్మించారు. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ ఇండియాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు చాలా మంది సైబర్ నేరగాళ్ల చేతిలో ఇరుక్కుంటున్నారు. వాటిని బేస్ చేసుకొని ఈ ‘CTRL’ మూవీ చేసినట్లు కనిపిస్తోంది.

Full View
Tags:    

Similar News