డాకు మహరాణులు స్పెషల్‌ అట్రాక్షన్‌..!

సినిమాలో బాలకృష్ణ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు ముగ్గురు ముద్దుగుమ్మలు చాలా స్పెషల్‌గా నిలిచారంటూ సినీ విశ్లేషకులతో పాటు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2025-01-13 10:00 GMT

బాలకృష్ణ, బాబీ కాంబోలో వచ్చిన డాకు మహారాజ్‌ సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. సినిమాకు అన్ని చోట్ల డీసెంట్‌ ఓపెనింగ్‌ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా హిట్ అంటూ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు, సినిమా యూనిట్‌ సభ్యులు అంతా సక్సెస్ పార్టీ చేసుకున్నారు. త్వరలో అనంతపురంలో భారీ ఎత్తున విజయోత్సవ వేడుక జరుపుకుంటామని అధికారికంగా నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. సినిమాలో బాలకృష్ణ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు ముగ్గురు ముద్దుగుమ్మలు చాలా స్పెషల్‌గా నిలిచారంటూ సినీ విశ్లేషకులతో పాటు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ కనిపించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి కొంత సమయం అయినా కీలకమైన డాకు సన్నివేశాల్లో ఆమె కనిపించడం వల్ల ఆకట్టుకుంది. ప్రగ్యా జైస్వాల్‌ మెయిన్‌ లీడ్ హీరోయిన్‌ అయినా ఫస్ట్‌ హాఫ్ మొత్తం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా అందంతో మెప్పించింది. పోలీస్ ఆఫీసర్‌గా ఊర్వశి రౌతేలా కనిపించింది. ఆ సన్నివేశాల్లో ఊర్వశి అదరగొట్టింది. ఒకటి రెండు యాక్షన్‌ సన్నివేశాల్లోనూ తన సత్తా చాటింది. ఇక దబిడి దిబిడి సాంగ్‌తో మతి పోగొట్టింది. డాన్స్ విషయంలో మరోసారి తెలుగు ప్రేక్షకులు ఊర్వశి గురించి మాట్లాడుకునే రేంజ్‌లో డాన్స్ చేసి మెప్పించింది.

ఇక ఈ సినిమాలో కనిపించిన మరో ముద్దుగుమ్మ శ్రద్దా శ్రీనాథ్‌. ఈమె బాలకృష్ణకు జోడీగా నటించకున్నా సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో నటించింది. తక్కువ సమయం కనిపించినా కథ మెయిన్‌గా ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చివర్లో ఆమె పాత్ర ద్వారా వచ్చే ట్విస్ట్‌కి ప్రేక్షకుల మతి పోతుంది. కలెక్టర్ పాత్రలో శ్రద్దా ఆకట్టుకుంది. నటనతో మరోసారి తన ప్రతిభ చాటుకుంది. మొదట నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనే ప్రచారం జరిగింది. కానీ ఊహకు అందని విధంగా ఆమె పాత్ర ఈ సినిమాలో ఉంది. అలా ముగ్గురు ముద్దుగుమ్మలు సినిమాలో మెయిన్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

డాకు మహారాజ్ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు ఓవర్‌ హై వోల్టేజ్‌ స్థాయికి చేరినప్పుడు ఈ ముగ్గురు హీరోయిన్స్‌ అందంతో బ్యాలన్స్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఊర్వశి రౌతేలా కనిపించే ఫస్ట్‌ హాఫ్ సన్నివేశాలు బాగున్నాయి. ఆమె కనిపించే సన్నివేశాలకు మాస్ ఆడియన్స్ ఎంజాయ్‌ చేస్తారు. ఊర్వశి రౌతేలా తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కి లక్కీ ఛామ్‌గా మారింది. బాబీ గత చిత్రం వాల్తేరు వీరయ్య సినిమాలోనూ ఊర్వశి రౌతేలా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, ఇప్పుడు మరోసారి తెలుగు లో ఊర్వశికి దర్శకుడు బాబీ ద్వారా మంచి విజయం దక్కింది. కనుక ముందు ముందు టాలీవుడ్‌లో ఊర్వశి మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News