డాకు మహారాజ్… బిజినెస్ కూడా గట్టిగానే!
అలాగే హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి ‘డాకు మహారాజ్’ వస్తోంది. అందుకే మూవీ పైన అంచనాలు భారీగా ఉన్నాయి.
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డాకు మహారాజ్’ జనవరి 12న థియేటర్స్ లోకి రాబోతోంది. బాలయ్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్స్ విషయంలో ఈ వారం నుంచి మరింత స్పీడ్ పెంచబోతున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఏపీలో చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. నైజాంలో ఈ సినిమా హక్కులు దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
ఓవర్సీస్ లో శ్లోక ఎంటర్టైన్మెంట్స్, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్రాలో 40 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. ఇక సీడెడ్ లో కూడా భారీ బిజినెస్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య కెరియర్ లోనే అత్యధిక ప్రీరిలీజ్ ఈ చిత్రానికి జరిగిందని టాక్. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది.
అలాగే హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి ‘డాకు మహారాజ్’ వస్తోంది. అందుకే మూవీ పైన అంచనాలు భారీగా ఉన్నాయి. కచ్చితంగా సంక్రాంతి రేసులో బాలయ్య ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మూవీ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ తర్వాత సినిమాపైన అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
బాలయ్య ఈ చిత్రంలో కూడా డ్యూయల్ రోల్ లోనే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించబోతోంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. సంక్రాంతి అంటేనే బాలయ్యకి సెంటిమెంటల్ గా కూడా కలిసొచ్చే కాలం. గ్రామీణ ప్రాంతాలలో ప్రేక్షకులు ఈ సమయంలో ఎక్కువగా సినిమాలు చూడటానికి ఇష్టపడతారు.
అందుకే ‘డాకు మహారాజ్’ ఈ సారి సంక్రాంతి రేసులో జోరు చూపించడం ఖాయం అనుకుంటున్నారు. దీంతో పాటు రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వీటిలో ఏది ఫెస్టివల్ విన్నర్ గా నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.