'డాకు మహారాజ్‌' ప్రీక్వెల్‌ కన్ఫర్మ్‌

సినిమా విడుదల అయ్యి పాజిటివ్‌ టాక్‌ దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ ఇతర యూనిట్‌ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు.

Update: 2025-01-12 11:40 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్‌ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల అయ్యి పాజిటివ్‌ టాక్‌ దక్కించుకున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ ఇతర యూనిట్‌ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందా అనే విషయాన్ని గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఇతర భాషల్లో ఈ సినిమాను డబ్‌ చేసి విడుదల చేసే అంశంపైనా నాగవంశీ స్పందించారు.

సినిమా సక్సెస్ అయితే సీక్వెల్‌ తీస్తామని గతంలో నాగవంశీ ప్రకటించాడు. ఆ విషయాన్ని మీడియా సమావేశంలో రిపోర్టర్‌ ప్రశ్నించిన సమయంలో నిర్మాత నాగవంశీ స్పందిస్తూ... ఈ సినిమాకు సీక్వెల్‌ కాకుండా ప్రీక్వెల్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. సినిమాలో ఒక తల లేని విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహంలోని వ్యక్తిని హీరోగా చూపిస్తూ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు. సినిమా కథకి సీక్వెల్‌ కంటే ప్రీక్వెల్‌కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెబుతున్నారు. ప్రీక్వెల్‌ కోసం కథను రెడీ చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

బాలకృష్ణను పవర్‌ ఫుల్‌ డాకు మహారాజ్‌గా చూపించి దర్శకుడు బాబీ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశాడు. అందుకే ఆ పాత్రను మరింతగా పెంచి ప్రీక్వెల్‌గా రూపొందిస్తే బాగుంటుందని నిర్మాత నాగ వంశీతో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకి వస్తున్న టాక్‌ నేపథ్యంలో ప్రీక్వెల్‌ను వెంటనే చేసే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. ఇక ఈ సినిమా డబ్బింగ్ రిలీజ్‌పై నిర్మాత నాగవంశీ స్పందించాడు. త్వరలోనే హిందీ, తమిళ్‌లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఇప్పటికే డబ్బింగ్‌ వర్క్ మొదలు పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు.

బ్యాక్ టు బ్యాక్‌ వరుసగా మూడు సినిమాలత సక్సెస్‌లను సొంతం చేసుకున్న బాలకృష్ణ భారీ అంచనాల నడుమ ఈ సినిమాను చేశాడు. గత ఏడాదిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా గత ఏడాది జరిగిన ఎన్నికల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. బాబీ దర్శకత్వంలో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్‌ టాక్‌ దక్కించుకున్న నేపథ్యంలో డాకు మహారాజ్‌ హిట్ కావడం ఖాయం అని అంతా అనుకున్నారు. ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే సినిమాకు మంచి స్పందన వస్తుంది. లాంగ్‌ రన్‌లో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఈ సినిమాను హిందీ , తమిళ్‌లో డబ్ కావడంతో పాటు ప్రీక్వెల్‌ సైతం త్వరలో రాబోతుంది.

Tags:    

Similar News