క్లిక్ క్లిక్ : లంకలో వైభవంగా దగ్గుబాటి వారి పెళ్లి వేడుక
టాలీవుడ్ కి చెందిన అత్యంత ప్రముఖ ఫ్యామిలీల్లో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి
టాలీవుడ్ కి చెందిన అత్యంత ప్రముఖ ఫ్యామిలీల్లో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. ఆ ఫ్యామిలీకి చెందిన పెళ్లి వేడుక శ్రీలంకలో జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్లుగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి వార్తలు వస్తున్నాయి. సమీప బంధువు అయిన ప్రత్యూష తో అభిరామ్ పెళ్లి అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.
ఆ వార్తలను కుటుంబ సభ్యులు దృవీకరించక పోవడంతో నిజమేనా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. సడన్ గా అభిరామ్, ప్రత్యూష పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. శ్రీలంక లో పెళ్లి వేడుక వైభవంగా జరిగిందని కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
దగ్గుబాటి సురేష్ బాబుకు ఇద్దరు కుమారులు. అందులో రానా ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయన కరోనా సమయంలో పెళ్లి పీటలు ఎక్కాడు. ఇక అభిరామ్ 'అహింస' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తాజాగా అభిరామ్ కూడా ఒక ఇంటివాడు అయ్యాడు.
అభిరామ్ పెళ్లి వేడుకలో రానా దంపతులు సందడి చేశారు. ఇంకా దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన వారు మరియు ప్రత్యూష ఫ్యామిలీకి చెందిన వారు వివాహ వేడుకలో పాల్గొన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో టాలీవుడ్ ప్రముఖులతో పాటు, బంధు మిత్రులకు, ఫ్యాన్స్ కి భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసి దగ్గుబాటి వారు విందు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.