డార్లింగ్ రిలీజ్ ట్రైలర్: ప్రియదర్శి జీవితంలో ట్విస్టు?
అయితే టీజర్, ట్రైలర్‌తో ఉత్సాహం పెంచిన టీమ్ ఈ సినిమాలో ఏదో సంథింగ్ ఉంది అని భావించేలా చేయగలిగారు. ఇప్పుడు డార్లింగ్ రిలీజ్ ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేసారు.
నభా నటేష్ - హాస్యనటుడు ప్రియదర్శి కలయికలో ఒక సినిమా రూపొందడం అందరిలో ఆసక్తిని పెంచింది. డార్లింగ్ అనేది టైటిల్. డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ డైలాగ్‌తో కూడిన టీజర్ ఇంతకుముందు ఆకట్టుకుంది. ఆ తర్వాత ట్రైలర్ అంతే క్యూరియాసిటీని పెంచింది. అయితే డార్లింగ్ అని పరిచయం లేని మహిళలను సంబోధించడం గురించి కోల్‌కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ అలాంటి పదాలను లైంగిక వేధింపులుగా భావించే అవకాశాలున్నాయని టీజర్ నొక్కి చెప్పింది. ఇది ప్రియదర్శి వంటి పురుషపుంగవులకు ఎరక్కపోయి ఇరుక్కుపోవడమేననేది సంజ్ఞ.
అయితే టీజర్, ట్రైలర్‌తో ఉత్సాహం పెంచిన టీమ్ ఈ సినిమాలో ఏదో సంథింగ్ ఉంది అని భావించేలా చేయగలిగారు. ఇప్పుడు డార్లింగ్ రిలీజ్ ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రియదర్శి- నభా నటేష్ జంట గురించిన ఎమోషనల్ టర్న్ ని హైలైట్ చేయడం ఆసక్తిని కలిగించింది. భార్య అంటే ఏమిటో చెబుతూ ప్రియదర్శి ఫ్రెండు చాలా సంగతులే చెప్పేస్తున్నాడు. అడ్డూ అదుపూ లేని భార్య ఎలా ఉంటుందో నభా పాత్రలో ఎలివేట్ చేసిన తీరు చూస్తుంటే ఈ సినిమాలో ఫన్ ఎలిమెంట్ కి , వినోదానికి కొదవేమీ లేదని అర్థమవుతోంది. భార్యతో ప్రియదర్శి కష్టం ఏమిటన్నది పెద్ద తెరపైనే చూడాలి.
`డార్లింగ్`లో నభా నటేష్ - ప్రియదర్శి మొదటి సారి జంటగా నటిస్తున్నారు. ఇంతకుముందు విడుదలైన సింగిల్ ఆకట్టుకుంది. రెండు ట్రైలర్లు క్యూరియాసిటీని పెంచాయి. ప్రమోషనల్ మెటీరియల్ తో ప్రియదర్శి టీమ్ ఉత్కంఠను పెంచుతోంది. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్‌రెడ్డి డార్లింగ్‌ని నిర్మిస్తున్నారు. గతంలో ఎవరుమే తేవై ఇల్లా (2021), అన్బరివు (2022) చిత్రాలను రూపొందించిన అశ్విన్‌రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై, ఎడిటింగ్: ప్రదీప్ ఇ రాఘవ.