దర్శన్ ఫామ్‌హౌస్ మేనేజర్ ఆత్మహత్యపై ద‌ర్యాప్తు

కన్నడ నటుడు దర్శన్, అత‌డి ప్రియురాలు ప‌విత్ర గౌడ‌ల‌ను అరెస్ట్ చేసి పోలీసులు క‌స్ట‌డీలో విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే

Update: 2024-06-18 16:21 GMT

కన్నడ నటుడు దర్శన్, అత‌డి ప్రియురాలు ప‌విత్ర గౌడ‌ల‌ను అరెస్ట్ చేసి పోలీసులు క‌స్ట‌డీలో విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే ఈ హ‌త్య‌తో ప్ర‌మేయం ఉన్న ద‌ర్శ‌న్ అభిమాని తండ్రి గుండె పోటుతో మ‌ర‌ణించారు. ఇప్పుడు ఇదే కేసుతో సంబంధం ఉన్న మ‌రో ఊహించ‌ని ఘ‌ట‌న‌. ద‌ర్శ‌న్ ఫామ్ హౌస్ మేనేజర్ శ్రీ‌ధ‌ర్ (బెంగళూరు ఫామ్‌హౌస్‌ను చూసుకునేవాడు) అదే ఫామ్ హౌస్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు సూసైడ్ నోట్ రాసి, వీడియో సందేశాన్ని కూడా క్లూ వదిలిపెట్టాడు. అతడి మృతదేహాన్ని ఫామ్‌హౌస్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు.

విపరీతమైన ఒంటరితనం కారణంగా జీవితాన్ని ముగించాల‌ని నిర్ణయించుకున్నట్లు సూసైడ్ నోట్‌లో మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నాడు. అతడు అదే కారణాన్ని పేర్కొన్న వీడియో సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఈ కేసులో తన ప్రియమైన వారిని ఎవ‌రినీ విచారించ‌వ‌ద్ద‌ని అధికారులను కోరారు. తన మరణానికి తానే కారణమని నోట్‌లో రాసుకున్నాడు. అయితే మేనేజ‌ర్ ఆత్మహత్యకు దర్శన్‌ ఇరుక్కున్న రేణుకాస్వామి హత్య కేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని తనిఖీ చేసేందుకు పోలీసులు ఇప్పుడు మ‌రో కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

Read more!

దర్శన్ మాజీ మేనేజర్ మల్లికార్జున్ 2018 నుండి తప్పిపోయాడని.. అత‌డు క‌నిపించ‌డం లేద‌ని క‌థ‌నాలు వ‌చ్చిన‌ ఒక రోజు తర్వాత ఇప్పుడు మేనేజ‌ర్ శ్రీ‌ధ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. మ‌ల్లికార్జున్ పారిపోయి కనిపించకుండా పోయే ముందు ద‌ర్శ‌న్ నుండి రూ. 2 కోట్లు దొంగిలించాడని కూడా క‌థ‌నాలొచ్చాయి.

రేణుకాస్వామి హత్య రోజున దర్శన్ ను లంచ్‌కి కలిసిన స్నేహితుడు చిక్కన్నను ఈ రోజు పోలీసులు ప్రశ్నించారు. సంచలనం సృష్టించిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ జూన్ 12న దర్శన్‌ని అరెస్ట్ చేశారు. ద‌ర్శ‌న్ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలను పంప‌డం వ‌ల్ల‌నే రేణుకాను హ‌త్య చేసార‌ని పోలీసులు చెబుతున్నారు.

అతను తన అభిమానులు గూండాల సమూహానికి భారీ మొత్తాన్ని చెల్లించి, రేణుకను కిడ్నాప్ చేసి, అతడిని కొట్టి, చిత్ర‌హింస‌లు పెట్ట‌డంతో మృతి చెందాడ‌ని రిపోర్టులు అందాయి. హత్య అనంతరం మృతదేహాన్ని బెంగళూరులోని ఓ డ్రెయిన్‌లో పడేశారు. ఈ కేసులో పవిత్ర కూడా జైలులో ఉన్నారు.

Tags:    

Similar News