దసరా సినిమాలు.. రికార్డ్ బిజినెస్!
మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి దసరా రేసులో పోటీ పడే సినిమాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి
మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి దసరా రేసులో పోటీ పడే సినిమాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలపై నెక్స్ట్ లెవల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూడు దేనికవే ప్రత్యేకమైన సినిమాలు కావడం విశేషం. ఇందులో రవితేజ, విజయ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి సిద్ధమవ్వడం విశేషం.
వరుస రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఉన్న బాలయ్య భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాపై ఇప్పటికే బిజినెస్ క్లోజ్ అయ్యింది. కనీసం ట్రైలర్ కూడా రాకుండానే గ్లింప్స్ తోనే బిజినెస్ డీల్స్ కంప్లీట్ కావడం విశేషం. ఈ మూవీ నైజాం హక్కులని దిల్ రాజు 14 కోట్లకి కొన్నారంట.
సీడెడ్ రైట్స్ అభిషేక్ రెడ్డి 14 కోట్లకి దక్కించుకున్నారు. ఆంధ్రాలో ఆరు ప్రాంతాలు కలుపుకొని 35 కోట్లకి డీల్ సెట్ అయ్యింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల బిజినెస్ భగవంత్ కేసరిపై జరిగిందంట. ఇక ఫస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావుపై ప్రపంచ వ్యాప్తంగా కేవలం తెలుగు భాషలోని 40 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అందులో తెలుగు రాష్ట్రాల బిజినెస్ వాటా 30 కోట్లు. ఇతర భాషలలో ఏ మేరకు బిజినెస్ చేసిందనేది తెలియాల్సి ఉంది.
దీని తర్వాత మోస్ట్ అవైటెడ్ మూవీగా లియో రిలీజ్ కాబోతోంది. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబోలో మాస్టర్ తర్వాత వస్తోన్న సినిమా ఇది. ఈ చిత్రంపై తెలుగు రాష్ట్రాలలో 22 కోట్ల బిజినెస్ జరిగిందంట. ఇళయదళపతి విజయ్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ బిజినెస్ డీల్ అని చెప్పొచ్చు. ఈ మూవీ నైజాం హక్కులు 4 కోట్లకి, సీడెడ్ 7 కోట్లకి అమ్ముడయ్యాయి.
ఆంధ్రాలో ఆరు ప్రాంతాలు కలుపుకొని 11 నుంచి 12 కోట్ల బిజినెస్ ఒప్పందాలు జరిగాయి. మొత్తం మీద దసరా బరిలో పోటీ పడుతున్న సినిమాలపై డిస్టిబ్యూటర్స్ మాత్రం గట్టి నమ్మకాలు పెట్టుకున్నారు. అయితే వీటిలో ఏ చిత్రం ప్రేక్షకాదరణ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనేది ఇప్పుడు వేచి చూడాలి.