పూరి ప్లానేంటిప్పుడు? ప్ర‌యాణం ఎటు!

ఇక యంగ్ హీరోలు అంటే? వాళ్ల జాగ్ర‌త్త‌లో వాళ్లు క‌నిపిస్తున్నారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో పూరి త‌దుప‌రి హీరో ఎవ‌రు? అవుతారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Update: 2024-09-12 22:30 GMT

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ ప్లాన్ ఏంటి? ప్ర‌యాణం ఎంటు? అవును ఇప్పుడు పూరి అభిమానుల్ని తొలి చేస్తోన్న ప్ర‌శ్న ఇది. వ‌రుస ప‌రాజ‌యాల నేప‌థ్యంలో పూరి త‌దుప‌రి జ‌ర్నీ ఎలా ఉంటుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 'లైగ‌ర్', 'డబుల్ ఇస్మార్ట్' రూపంలో రెండు ప్లాప్ లు ఎదుర‌య్యాయి. 'లైగ‌ర్' ప్లాప్ తర్వాత రిస్క్ తీసుకోకూడ‌ద‌ని 'ఇస్మార్ట్ శంక‌ర్' కి సీక్వెల్ చేస్తే అది దారుణ‌మైన ఫ‌లితాన్ని అందించింది.

ఆ సీక్వెల్ ని పూరి ఓ సేఫ్ జోన్ గా భావించి చేస్తే అదే చేతులు కాల్చింది. అంత‌కు ముందు లైగ‌ర్ ప్లాప్ కార‌ణంగా డేట్లు ఇచ్చిన హీరోనే వెన‌క్కి త‌గ్గాడు. హిట్ కొట్టిన త‌ర్వాత సినిమా చేద్దాం లే అన్న‌ట్లు స్కిప్ కొట్టాడు. అదే సినిమా ప్లాప్ తో డిస్ట్రిబ్యూట‌ర్ల యాగీ తెలిసిందే. డ‌బుల్ ఇస్మార్ట్ తో ఆలెక్క‌లు స‌రిచేద్దాం అని పూరి భావించాడు. కానీ ఫ‌లితం తేడా కొట్టే స‌రికి సీన్ మారింది. మ‌రి ఇప్పుడు పూరి ప్లానేంటి? త‌దుప‌రి ప్లానింగ్ ఎలా ఉండ‌బోతుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

పూరి ఉన్న తాజా ప‌రిస్థితుల్లో అత‌డితో ఏ స్టార్ హీరో సినిమా చేయ‌డానికి సాహ‌సించ‌డు అన్న‌ది వాస్త‌వం. అలా స్టార్ హీరో కోసం ప్ర‌య‌త్నించి పూరి ఎలా భంగ‌ప‌డ్డాడో కూడా తెలిసిందే. ఎన్నో హిట్లు అందుకున్న‌ హీరోనే పూరిని చూసి ముఖం చాటేసాడు. ఇక టైర్ -2 హీరోలు అంటే వాళ్లు చాలా బిజీగా ఉన్నారు. 100 కోట్లు వ‌సూళ్లు తెచ్చిన డైరెక్ట‌ర్ల‌కే టైర్ -2 హీరోలు కాల్షీట్లు ఇవ్వ‌లేక‌పోతున్నారు.

ఇక యంగ్ హీరోలు అంటే? వాళ్ల జాగ్ర‌త్త‌లో వాళ్లు క‌నిపిస్తున్నారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో పూరి త‌దుప‌రి హీరో ఎవ‌రు? అవుతారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అలాగ‌ని ఇంట్లో సొంత హీరో ఆకాష్ ఉన్నా? అత‌డి తో డేర్ చేయ‌లేని ప‌రిస్థితి. త‌న వ‌ర‌కూ వ‌చ్చిన సినిమాలేవో చేసుకుంటున్నాడు. ఆకాష్ తో సినిమా చేయాల‌న్నా? బ‌య‌ట నిర్మాత కావాలి.

ఇలా ఎన్నో పూరి త‌దుప‌రి సినిమాకి చిక్కులు క‌నిపిస్తున్నాయి. అయితే ఇలాంటివి పూరికి కొత్తేం కాదు. జీవితంలో ఎన్నో డ‌క్కామ‌క్కీలు తిని స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగాడు. అమితాబ్ లాంటి లెజెండ‌రీని సైతం డైరెక్ట్ చేసిన గ్రేట్ మేక‌ర్. మరెంతో మంది స్టార్ హీరోల అభిమాన ద‌ర్శ‌కుడు. మ‌రి సెకెండ్ ఛాన్స్ ఏ రూపంలో వ‌స్తుందో చూడాలి.

Tags:    

Similar News