కల్కిలో దీపిక.. నాగి కావాలనే అలా..

వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ.

Update: 2024-06-12 06:20 GMT

వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా.. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ రేంజ్ లో కల్కి ప్రపంచాన్ని సృష్టించిన మేకర్స్.. అంతకుమించి ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ట్రైలర్ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి భారీ క్యాస్టింగ్ అంతా కనిపించి మూవీపై అంచనాలను మరిన్ని పెంచేశారు. వరల్డ్ వైడ్ కు ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నాగ్ అశ్విన్ వర్క్ తో పాటు కల్కి ప్రపంచాన్ని చూసి అంతా ఫిదా అవుతున్నారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, వెహికల్స్, వెపన్స్ అన్నీ అదిరిపోయాయని చెబుతున్నారు. ఇప్పుడు కల్కి ట్రైలర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ సినిమా స్టోరీ కోసం జోరుగా చర్చ సాగుతోంది. కథ అంతా కొత్తగా ఉండనున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. అదే సమయంలో దీపికా పదుకొణె డబ్బింగ్ అసలు బాగోలేదని విమర్శలు చేస్తున్నారు. దీపికానే చెప్పిందా లేక వేరే ఎవరైనా చెప్పారా అని ప్రశ్నిస్తున్నారు. తెలుగు తెలియని పాత్రలో ఆమె నటించిందా? లేక కావాలనే అలా చెప్పించారా? అని నెటిజన్లు అడుగుతున్నారు. ఈ విషయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు.

సైన్స్ డిస్టోపియన్ జోనర్ లో కల్కి సినిమా తెరకెక్కుతుంది కనుక.. లాంగ్వేజ్ ఎవల్యూషన్ ను మేకర్స్ దృష్టిలో పెట్టుకున్నట్లు తెలుస్తోందని అంటున్నారు. కావాలనే అలా డబ్బింగ్ చెప్పించారని చెబుతున్నారు. 800 ఏళ్ల భవిష్యత్తు కోణంలో మూవీ వస్తుంది కాబట్టి.. భాషాపరమైన మార్పులకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. జనరేషన్ వారీగా భాష ఎలా మారిందో దీపిక రోల్ ద్వారా మేకర్స్ చెప్పే ప్రయత్నం చేసేరేమోనని అంటున్నారు.

ఏదేమైనా ఆ విషయాన్ని పక్కన పెట్టి.. సినిమాలోని కల్కి ప్రపంచాన్ని ఆస్వాదించాలని చెబుతున్నారు. టాలెంటెడ్ నాగ్ అశ్విన్ డిసెషన్ ను లోతుగా అర్థం చేసుకోవాలని అంటున్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత.. రోల్ ను జడ్జ్ చేసి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. జూన్ 27న సినిమా థియేటర్లలో విడుదల అయ్యాక అసలు విషయం తెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరి మూవీ రిలీజ్ అయ్యాక ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News