వోగ్ ఇండియాపై దీపిక దుమారం!
క్యాలెండర్ గాళ్ల్ గా పాపులర్ అయిన తెరంగేట్రం చేసిన హీరోయిన్ కా బట్టి మ్యాగజైన్ కవర్ పేజీల కోసం ఏ రేంజ్ లో సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో గెస్ చేయోచ్చు.
బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ దీపికా పదుకొణే ఇన్ స్టా సంచనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. సక్సెస్ అయ్యాను కదా? అని కామ్ గా కూర్చుంటే పనవ్వదని అమ్మడికి బాగా తెలుసు. అందుకే నవతరం నాయికల తోనూ బ్యూటీ విషయంలో పోటీ పడుతుంది. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ తనదైన ప్రత్యేకతని చాటుతుంది. ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో అమ్మడు కొలువు దీరే విధానం గురించైతే మరో ముచ్చట అవసరం లేదు.
క్యాలెండర్ గాళ్ల్ గా పాపులర్ అయిన తెరంగేట్రం చేసిన హీరోయిన్ కా బట్టి మ్యాగజైన్ కవర్ పేజీల కోసం ఏ రేంజ్ లో సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో గెస్ చేయోచ్చు. ఇప్పటికే పలు కవర్ పేజీలపై అందాలు ఆరబోసిన అమ్మడు మరోసారి ప్రఖ్యాత వోగ్ ఇండియా మ్యాగజైన్ పై తళుక్కున మెరిసింది. షూట్ తోకాకుండా ఏకంగా మ్యాగజైన్ తో నెటి జనుల ముందుకొచ్చింది. ఇదిగో ఇక్కడిలా బ్లాక్ కలర్ డిజైన్డ్ దుస్తుల్లో అమ్మడు సెగలు పుట్టిస్తూ కెమెరాకి ఫోజులిచ్చింది.
షోల్డర్ లెస్ గౌను అమ్మడిని హైట్ అంతే గొప్పగా ప్రోజెక్ట్ చేస్తుంది. ఒక చేతిని హిప్ పై ..మరో చేతిని మోకాలిపై బ్యాలెన్స్ చేస్తూ బాడీని కాస్త బెండ్ చేస్తూ ఇచ్చిన భంగిమ ఆకర్షణీయంగా ఉంది. ఈ షూట్ కోసం దీపిక ఎంపిక చేసుకన్న యాక్సరీస్..జ్యువలెరీ మరింత అందాన్ని జోడించాయి. దీపిక పెదాలపై ఎర్రటి లిప్ స్టిక్ ..మ్యాకప్ ప్రతీది అమ్మడిని మరింత అందంగా మలిచాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక దీపిక సినిమాల సంగతి చూస్తే..బాలీవుడ్ మినహాయిస్తే తెలుగులో పాన్ ఇండియా చిత్రం కల్కీతో తెరంగేట్రం చేస్తుంది. ఇందులో ప్రభాస్ కి జోడీగా నటిస్తుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో దీపిక నటన ప్రత్యేకంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది