బీ టౌన్ సీనియర్స్ లో ఆమె ఒక్కరే..!

బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనే తన కెరీర్ మొదలు పెట్టి 18 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తూనే ఉంది

Update: 2024-03-23 05:23 GMT

బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనే తన కెరీర్ మొదలు పెట్టి 18 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తూనే ఉంది. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారిన దీపికా 2005 లో మొదట హిమేష్ రేషమ్మియాతో నామ్ హై తేరా మ్యూజిక్ వీడియోలో నటించింది. ఆ క్రేజ్ తో 2006 లో కన్నడ సినిమా ఐశ్వర్యలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా తో బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడిన దీపికా 2007 లో షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ వెళ్లింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడు స్టార్ క్రేజ్ తెచ్చుకుంది.

ఇక వరుస బాలీవుడ్ ఆఫర్లతో కెరీర్ ని బిజీ బిజీగా మార్చేసుకుంది దీపికా. మధ్యలో ఎంతోమంది హీరోయిన్స్ వచ్చి స్టార్ డం తెచ్చుకుని మళ్లీ ఫేడవుట్ అయ్యారు కానీ దీపికా పదుకొనె మాత్రం ఇప్పటికీ తన స్టార్ డం కొనసాగిస్తూనే ఉంది. 18 ఏళ్ల కెరీర్ లో 37 ఇండియన్ సినిమాలు రెండు ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన దీపికా పదుకొనే ప్రస్తుతం ప్రభాస్ లీడ్ రోల్ లో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమాలో నటిస్తుంది.

బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోయిన్స్ కి దాదాపు కెరీర్ ముగిసినట్టే అనిపిస్తుంది. ప్రియాంక ఎంచక్కా హాలీవుడ్ చెక్కేయగా మిగతా భామలంతా కూడా ఫేడవుట్ అయ్యారు. కత్రినా, కరీనా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నా స్టార్ ఛాన్స్ లు అందుకోవట్లేదు. కానీ దీపికా మాత్రం ఇప్పటికీ ఫుల్ ఫైర్ మీద ఉంది. ఈ మధ్యనే హృతిక్ తో ఫైటర్ సినిమాలో కూడా తన గ్లామర్ తో అలరించింది దీపికా.

ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకెళ్తున్న కియరా, అలియా భట్, దిశా పటాని, జాన్వి కపూర్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా దీపికా తన సత్తా చాటుతుంది. 18 ఏళ్ల తర్వాత మళ్లీ సౌత్ సినిమాల్లోకి అడుగు పెట్టిన దీపికా ఇక్కడ కూడా తన స్టార్ డం చూపించాలని చూస్తుంది. కల్కి సూపర్ హిట్ అయితే దీపికా వరుస తెలుగు సినిమాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సీనియర్ భామలంతా కూడా కెరీర్ ముగించేస్తుంటే దీపికా మాత్రం రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తుంది. ఈ ఫాం ఎప్పటికీ కొనసాగించేలా ఉంటుందని చెప్పొచ్చు. దీపికా ఈ రేంజ్ దూకుడు చూస్తుంటే మరో పదేళ్లు కూడా తను హీరోయిన్ గా దూసుకెళ్లేలా ఉందనిపిస్తుంది.

Tags:    

Similar News