డిప్రెష‌న్‌తో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా: దీపిక‌

దీపికా పదుకొణె తన జీవితంలో డిప్రెషన్ తో బాధ‌ప‌డ‌డం..దానితో పారాటం గురించి ధైర్యంగా మాట్లాడిన త్రోబ్యాక్ సంగ‌తులకు సంబంధించిన వీడియో మ‌రోసారి వైర‌ల్ అవుతోంది.

Update: 2023-10-10 18:57 GMT

డిప్రెష‌న్ పెను ప్రమాదం. ఒత్తిడితో క్ష‌ణికావేశంలో తీసుకునే నిర్ణ‌యాలు జీవితాన్ని అల్ల‌క‌ల్లోలంలోకి నెట్టేస్తాయి. ఒక్కోసారి ఆత్మార్ప‌ణానికి పాల్ప‌డి అయిన‌వారికి అన్యాయం చేస్తారు. ఒత్తిళ్ల‌పై చాలా మంది స్టార్లు తమ నిజ‌జీవిత అనుభ‌వాల్ని పాఠాలుగా వ‌ల్లించారు కూడా. గ‌తంలో ప‌లుమార్లు దీపిక ప‌దుకొనే ప‌బ్లిక్ వేదిక‌ల‌పై త‌న డిప్ర‌షన్ తో ఆత్మ‌హ‌త్యా య‌త్నం గురించి వివ‌రించారు. యువ‌త‌రం అలా ఆలోచించ‌కూడ‌ద‌ని స‌మ‌యోచితంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. దీపికా పదుకొణె తన జీవితంలో డిప్రెషన్ తో బాధ‌ప‌డ‌డం..దానితో పారాటం గురించి ధైర్యంగా మాట్లాడిన త్రోబ్యాక్ సంగ‌తులకు సంబంధించిన వీడియో మ‌రోసారి వైర‌ల్ అవుతోంది. దీపిక సూచ‌న‌లు చాలా మందికి త‌క్ష‌ణ‌ ప్రేరణగా మారాయి. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి దీపిక 'లైవ్ లవ్ లాఫ్' అనే NGOని కూడా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఎన్జీవో స‌మావేశంలో తాను డిప్రెషన్ తో ఎలా పోరాడిందో మరోసారి మాట్లాడింది. ఈ లక్షణాలను త‌న‌ తల్లి తొలిగా అర్థం చేసుకున్నార‌ని తెలిపింది. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నట్లు మాట్లాడుతున్నప్పుడు మానసికంగా కుంగిపోయిన త‌న‌ను త‌న త‌ల్లి గారు అర్థం చేసుకున్నారని తెలిపారు. ''నేను కెరీర్-అత్యున్నత స్థాయికి చేరుకున్నాను.. ప్రతిదీ బాగానే ఉంది.. కాబట్టి నేను ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకోవ‌డానికి స్పష్టమైన కారణం లేదు. కానీ నేను చాలా బ్రేక్ అయ్యాను. నేను నిద్రపోవాలనుకున్న రోజులు ఉన్నాయి.. ఎందుకంటే నిద్ర ప‌ట్టేది కాదు.. తప్పించుకోలేక‌పోయేదానిని. నేను కొన్ని సమయాల్లో ఆత్మహత్య చేసుకోవాల‌నుకున్నాను.

ఇలాంటి వాటన్నింటిని ఎదుర్కోవలసి వచ్చింది. నా తల్లిదండ్రులు బెంగుళూరులో నివశిస్తున్నారు. వారు నన్ను సందర్శించినప్పుడు నేను బాగానే ఉన్నాన‌ని వారికి చూపించాలని తరచుగా ధైర్యంగా ఉండేదానిని. చివ‌రిరోజు నా తల్లిదండ్రులు బయలుదేరి బెంగుళూరుకు వెళ్తున్నారు. నాకు అకస్మాత్తుగా ఏడుపు (బ్రేక్ డౌన్)వచ్చింది. మా అమ్మ నన్ను బాయ్ ఫ్రెండ్ లేదా ఏదైనా స‌మ‌స్య‌ ఉందా? లేదా ఇంకేదైనా జరిగిందా? అని సాధారణ ప్రశ్నలు అడిగారు. నా దగ్గర సమాధానం లేదు.. ఎందుకంటే ఇది ఏదీ కాదు.. అది ఖాళీగా ఉన్న ప్లేస్ నుండి పుట్టుకొచ్చిన ఒత్తిడి. అది నాకు తెలుసు. దేవుడు నా కోసం వారిని పంపాడు. ఈ సంకేతాలు లక్షణాలను అర్థం చేసుకున్నందుకు నా తల్లికి నేను క్రెడిట్ మొత్తం ఇస్తాను'' అని ఓపెన్ గా మాట్లాడారు.

ఒత్తిడిని జ‌యించ‌లేని బలహీనత గురించి వెల్ల‌డించేందుకు దీపిక‌ సిగ్గుపడలేదు. ఈ క్వాలిటీనే త‌న‌ను అత్యంత ధీశాలిగా నిల‌బెట్టింది. ఇంత ఎదిగాక‌ ఇప్పుడు కూడా మానసిక అనారోగ్యం గురించి మాట్లాడటం అంత సులభం కాదు.

ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాటిని అర్థం చేసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. దీపిక బాలీవుడ్ లో సంచ‌ల‌న క‌థానాయిక‌గా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకుంది. ప్ర‌స్తుతం నిర్మాత‌గానూ బిజీ అవుతున్నారు. దీపిక భ‌ర్త ర‌ణ‌వీర్ సింగ్ అగ్ర హీరోగా కొన‌సాగుతున్నారు. ఈ జంట అన్యోన్య‌త అభిమానుల్లో నిరంత‌రం చ‌ర్చ‌కు వ‌స్తుంటుంది.

Tags:    

Similar News