త‌ల్లిదండ్రులు కాబోతున్న స్టార్ క‌పుల్

బాలీవుడ్ స్టార్ క‌పుల్ దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ తమ మొదటి బిడ్డ రాక కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం

Update: 2024-02-20 15:41 GMT

బాలీవుడ్ స్టార్ క‌పుల్ దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ తమ మొదటి బిడ్డ రాక కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. ప్ర‌ఖ్యాత 'ది వీక్‌'తో వివరాలను షేర్ చేసిన ఓ సోర్స్ ప్రకారం.. దీపిక ఆరు నెల‌ల ఫ్రెగ్నెన్సీతో ఉంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై పుకార్లు షికార్ చేస్తున్నా కానీ.. దీప్ వీర్ జంట‌ ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

77వ BAFTA రెడ్ కార్పెట్ ఈవెంట్ సందర్భంగా దీపిక‌ తన మిడ్‌రిఫ్‌ను దాచిపెట్టి ర‌హ‌స్యాన్ని పాటించ‌డంతో ఈ పుకార్లకు ఆజ్యం పోసింది. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ అవార్డు వేడుకల‌ కోసం సభ్య‌సాచి ముఖర్జీ రూపొందించిన కస్టమ్ జ్యువెలరీ స‌హా అద్భుత‌మైన మెరుపుల‌ చీరలో తనను తాను అలంకరించుకుంది. దీపిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో సున్నితమైన చీరలో ఆకర్షణీయమైన ఫోటోల‌ను షేర్ చేసింది. డీపీ ఔత్సాహిక‌ అభిమానులలో గర్భధారణ సంబంధిత ఊహాగానాలకు ఇది దారితీసింది.

దీపికా గర్భం దాల్చుతుందనే పుకార్ల కారణంగా 'ది వైట్ లోటస్ సీజన్ 3' నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు కూడా క‌థ‌నాలొచ్చాయి. దీపిక - రణవీర్ మొదట సంజయ్ లీలా భన్సాలీ చిత్రం 'గోలియోన్ కి రాస్లీలా రామ్ లీలా' సెట్స్‌లో ప్రేమ‌లో ప‌డ్డారు. తరువాత 2018 లో వివాహ ప్రమాణాలను మార్చుకున్నారు. ఆరేళ్ల పాటు సాగిన ర‌హ‌స్య‌ శృంగార ప్రయాణానికి ఇది ముగింపు ప‌లికింది.

గతంలో ఒక మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక తల్లిదండ్రులు కావ‌డం కోసం తన ఆత్రుతను వ్యక్తం చేస్తూ, ''రణ్‌వీర్ నేను పిల్లలను ఆరాధిస్తాము. మేము మా స్వంత కుటుంబాన్ని ప్రారంభించే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము'' అని వ్యాఖ్యానించారు. ఇటీవలే హృతిక్ రోషన్‌తో కలిసి 'ఫైటర్'లో కనిపించిన దీపిక త‌దుప‌రి ప్రభాస్, అమితాబ్ బచ్చన్ లతో 'కల్కి 2898 AD'లో క‌నిపించ‌నుంది.

Tags:    

Similar News