ప్రాజెక్ట్ K - దీపికా ఎందుకు దూరమైనట్లు?
అందుకే దీపికా ఈ ప్రాజెక్ట్ కె టైటిల్ గ్లింప్స్ లాంఛ్, శాన్ డీగో కామిక్ ఈవెంట్‌కు హాజరు కావడం లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' టైటిల్ గ్లింప్స్‌ను.. ప్రతిష్టాత్మక శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్లో గ్రాండ్‌గా లాంఛ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం ప్రభాస్, రానా, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ అక్కడికి చేరుకున్నారు. అయితే చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న దీపికా పదుకొణె మాత్రం ఈ ఈవెంట్‌కు వెళ్లట్లేదని తెలిసింది. దీని వెనక బలమైన కారణమే ఉంది.
ప్రస్తుతం హాలీవుడ్లో నటీనటుల సమ్మె జరుగుతున్న తెలిసిందే. దీంతో షూటింగ్‌లన్నీ అర్థాంతరంగా నిలిచిపోయాయి. అదేంటి హాలీవుడ్లో నిరసనలు జరగడానికి.. దీపిక ఈవెంట్‌కు వెళ్లకపోవడానికి కారణమేంటని ఆలోచిస్తున్నారా? విషయంలోకి వెళితే.. ప్రస్తుతం అక్కడ సమ్మె చేస్తున్నది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్- అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ మెంబర్స్. ఈ ఫెడరేషన్లో దీపిక కూడా ఓ మెంబర్.
సమ్మెలో పాల్గొన్న సభ్యులంతా.. సినిమా షూటింగులకు, అలాగే వాటికి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లలోనూ పాల్గొన కూడదు. అందుకే దీపికా ఈ ప్రాజెక్ట్ కె టైటిల్ గ్లింప్స్ లాంఛ్, శాన్ డీగో కామిక్ ఈవెంట్‌కు హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని సినీ ఇండస్ట్రీ వర్గాలు తెలిపినట్లు ఇంగ్లీష్ వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ సమ్మెకు బాలీవుడ్‌భామ ప్రియాంకా చోప్రా కూడా మద్దతు తెలిపింది.
"స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ స్ట్రైక్ జరుగుతుండటం వల్ల నటీనటులు ఎవరూ ప్రమోషనల్ ఈవెంట్స్ లేదా షూటింగ్లో పాల్గొనకూడదని నిబంధనలు ఉన్నాయి. శాన్ డీగో కామిక్ కాన్ లాంటి భారీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదు. అందుకే దీపిక ఈ శాన్ డీగో ఈవెంట్‌కు హాజరు అవ్వడం లేదు" అని ఇంగ్లీష్ కథనాలు రాస్తున్నాయి.
కాగా, 2017లోనే స్టార్ యాక్టర్ విన్ డీజిల్‌తో కలిసి 'ట్రిపుల్ ఎక్స్' సినిమా ద్వారా అరంగేట్రం చేసింది దీపిక. ఆ సమయంలోనే ఈ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఫెడరేషన్లో సభ్యత్వం తీసుకుంది. ప్రస్తుతం ఈ భామ ప్రాజెక్ కెతో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. హృతిక్ రోషన్‌తో 'ఫైటర్', బాద్ షా షారుక్ ఖాన్‌తో కలిసి 'జవాన్'లో నటిస్తోంది.