దీపిక.. ఈ రికార్డు రిపీట్ అయ్యేనా?
బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనేకి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనేకి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల తన మొదటి ప్రెగ్నెన్సీ ని కూడా ప్రకటించింది. అంతేకాదు ఈ మధ్య ఓటేసేందుకు బేబీ బంప్ తో వచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
అయితే పెళ్లి తర్వాత హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గిపోతాయని అంటారు. కానీ దీపిక మాత్రం వరుస ఛాన్సులు దక్కించుకుంటోంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ పఠాన్ మూవీలో లీడ్ రోల్ లో కనిపించగా.. జవాన్ మూవీలో స్పెషల్ రోల్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.1050 కోట్లు వసూలు చేసిన పఠాన్ సినిమాలో బికినీలో కనిపించి ఓ రేంజ్ లో అలరించింది.
జవాన్ సినిమాలో గెస్ట్ రోల్ చేసినా.. తన యాక్టింగ్ తో కట్టిపడేసింది దీపిక. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1160 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఇక 2024లో హృతిక్ రోషన్ తో కలిసి ఫైటర్ మూవీ లో నటించిన దీపిక.. యావరేజ్ హిట్ అందుకుంది. మొత్తానికి దీపిక చివరి మూడు చిత్రాలు రూ.2600 కోట్లకు పైగా వసూలు చేశాయి. అలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కు సాధ్యం కాని రికార్డును ఆమె క్రియేట్ చేసింది.
ఇప్పుడు దీపిక.. త్వరలోనే కల్కి 2898 ఏడీ మూవీతో సందడి చేయనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ మరో నెల రోజుల్లో విడుదల కానుంది. రూ.600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పునర్జన్మ ఎత్తిన లక్ష్మీ దేవతలాగా దీపిక కనిపించబోతుందని, ఆమె పాత్ర పేరు పద్మ అని జోరుగా చర్చ నడుస్తోంది.
ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్ పై దీపిక రోల్ చాలా కలర్ ఫుల్ గా ఉండబోతుందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇటీవల జరిగిన ప్రభాస్ వెహికల్ బుజ్జి రివీల్ ఈవెంట్ లో దీపిక కనిపించలేదు. కానీ త్వరలో జరగనున్న కార్యక్రమాల్లో ఆమె పాల్గొనే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి దీపిక ఈ మూవీతో ఎలాంటి హిట్ కొడుతుందో? తన హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందో లేదో తెలియాలంటే జూన్ 27వ తేదీన వరకు వెయిట్ చేయాల్సిందే.