జుగుప్సాకరమైన మనిషి అతడు: కార్తీక్ సుబ్బరాజ్
ఈ అసభ్యకర వ్యాఖ్యలపై త్రిష స్పందిస్తూ, భవిష్యత్తులో మన్సూర్‌తో కలిసి పని చేయనని ప్రతిజ్ఞ చేయగా, లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతడి చర్యను తీవ్రంగా తప్పు పట్టాడు.
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ త్రిషపై చేసిన వ్యాఖ్యలపై మన్సూర్ అలీ ఖాన్‌పై మండిపడ్డారు. లియోలో త్రిషతో బెడ్ రూమ్ సన్నివేశంలో నటించే అవకాశం కల్పించలేదని మన్సూర్ తన హార్ట్‌బ్రేక్‌ను వ్యక్తం చేసాడు. త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డట్టు వ్యాఖ్యానించాడు. రేప్ గురించి అతడు జోక్ చేశాడు. ఈ అసభ్యకర వ్యాఖ్యలపై త్రిష స్పందిస్తూ, భవిష్యత్తులో మన్సూర్‌తో కలిసి పని చేయనని ప్రతిజ్ఞ చేయగా, లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతడి చర్యను తీవ్రంగా తప్పు పట్టాడు. చాలా మంది సెలబ్రిటీలు మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు దర్శకరచయిత కార్తీక్ సుబ్బరాజ్ కూడా మన్సూర్ అలీఖాన్‌ని దూషించాడు. జిగర్తాండ డబుల్‌ఎక్స్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మన్సూర్ అసహ్యకరమైన వ్యక్తి అని అన్నారు.
ఈ ఘటనకు సంబంధించి త్రిష చేసిన ప్రకటనను దర్శకుడు రీపోస్ట్ చేసి తన స్పందనను షేర్ చేసారు.
జుగుప్సాకరమైన మనిషి అతడు...సిగ్గుపడుతున్నాడు మన్సూర్ అలీఖాన్! అని కార్తీక్ సుబ్బరాజ్ వ్యాఖ్యానించారు.
ఖుష్బు సుందర్ ఎలా స్పందించింది?
నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ కూడా మన్సూర్ అలీఖాన అసభ్య వ్యాఖ్యలను ఖండించారు. X లో ఖుష్బూ వ్యాఖ్యానిస్తూ..``కొంతమంది పురుషులు స్త్రీని అవమానించడం లేదా ఆమె గురించి అత్యంత అగౌరవంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అని అనుకుంటారు. #మన్సూర్ అలీఖాన్ ఇటీవలి వీడియో అటువంటి ఉదాహరణ. ఆయన ప్రసంగాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వారి ``చుమ్మా కామెడీకి సొన్నెన్`` వైఖరి విస్మరించబడుతుందని వారు భావిస్తున్నారు. లేదు..అలా జరగదు. అతడు తన ప్రసంగంలో పేర్కొన్న ప్రతి మహిళా నటికీ తన డర్టీ, మిసోజినిస్ట్, నీచమైన మనస్తత్వాన్ని ప్రదర్శించినందుకు సాధారణంగా మహిళలకు క్షమాపణలు చెప్పాలి. నేటి మహిళలు తమ గౌరవం కాపాడుకోవడం కోసం పోరాడేంత బలంగా ఉన్నారు`` అని వ్యాఖ్యానించారు.
త్రిష గురించి మన్సూర్ అలీ ఖాన్ ఏమన్నాడు?
లియో చిత్రంలో త్రిషతో తనకు స్క్రీన్ పంచుకునే అవకాశం రాలేదని మన్సూర్ అన్నాడు. మన్సూర్ తమిళంలో మాట్లాడుతూ, ``నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, సినిమాలో బెడ్ రూమ్ సన్నివేశం ఉంటుందని అనుకున్నాను. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను పడకగదికి తీసుకువెళ్లాలని అనుకున్నాను. నేను చాలా రేప్ సన్నివేశాలు చేసాను. ఇది నాకు కొత్త కాదు. కానీ కాశ్మీర్‌లో షూటింగ్ సమయంలో ఈ కుర్రాళ్ళు త్రిషను సెట్స్‌లో కూడా నాకు చూపించలేదు`` అని జోక్ చేసే ప్రయత్నం చేసాడు. కానీ అది వికటించి ఇప్పుడు పెద్ద రచ్చవుతోంది. అతడి వ్యాఖ్యలపై కోలీవుడ్ సీరియస్ గా ఉంది.