దేవర-- బాహుబలిని కొట్టేసిందా?

అయితే ప్రేక్షకులకి మూవీ నచ్చితే రివ్యూలని అస్సలు పట్టించుకోరని ‘దేవర’ మూవీ ప్రూవ్ చేసింది.

Update: 2024-10-14 05:17 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఎవ్వరి అంచనాలకి అందని విధంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటూ 500 క్లబ్ లో చేరిపోయిందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన టాక్ చూసిన తర్వాత బ్రేక్ ఈవెన్ కూడా అందుకోవడం కష్టం అని చాలా మంది భావించారు. అయితే ప్రేక్షకులకి మూవీ నచ్చితే రివ్యూలని అస్సలు పట్టించుకోరని ‘దేవర’ మూవీ ప్రూవ్ చేసింది. ఎన్టీఆర్ వన్ మెన్ షోకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

అందుకే 16 రోజుల్లో ఈ మూవీ ఏకంగా 509 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగలిగింది. ఈ కలెక్షన్స్ వివరాలని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు. ‘దేవర’ మూవీ కలెక్షన్స్, రిజల్ట్ విషయంలో తారక్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఖాతాలో ఇప్పుడు మరో రికార్డ్ చేరింది. రాజమౌళి ‘బాహుబలి 1’ తో మొదటిసారిగా పాన్ ఇండియా లెవల్ లో ఏకంగా 194 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్నారు.

టాలీవుడ్ హిస్టరీలో అత్యధిక షేర్ అందుకున్న చిత్రంగా ‘బాహుబలి 1’ నిలిచింది. తరువాత ఈ రికార్డ్ ని రాజమౌళి ‘బాహుబలి 2’ తోపాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో బ్రేక్ చేశారు. ఎవ్వరు అందుకోలేనంత స్థాయిలో షేర్ రికార్డ్ ని రాజమౌళి ‘బాహుబలి 2’ తో క్రియేట్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కూడా ఆ రికార్డ్ ని బ్రేక్ చేయలేదు. ఈ రికార్డ్ ని మరల జక్కన్న మాత్రమే బీట్ చేయగలడని సినీ విశ్లేషకులు నమ్ముతున్నారు. ఇండియన్ ఇండస్ట్రీలో అందరూ నాన్ ‘బాహుబలి 2’ రికార్డ్స్ గురించి మాత్రమే ఇప్పుడు ఆలోచిస్తున్నారు.

ముఖ్యంగా ‘బాహుబలి 1’ షేర్ రికార్డ్ పై ముందుగా కన్నేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ‘సలార్’, ‘కల్కి 2898ఏడీ’ సినిమాలతో 200 కోట్ల షేర్ క్లబ్ లో చేరి ‘బాహుబలి 1’ మూవీ షేర్ రికార్డ్ ని రెండు సార్లు బ్రేక్ చేశాడు. రాజమౌళి ప్రమేయం లేకుండా ‘దేవర 1’ తో ఎన్టీఆర్ కూడా ‘బాహుబలి 1’ షేర్ రికార్డ్ ని అధికమించాడు. ఈ మూవీ అఫీషియల్ గా 200 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది. 17 రోజుల్లో ఈ సినిమాకి 240+ షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.

‘దేవర’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 184 కోట్లు. దసరా ఫెస్టివల్ హాలిడేస్ లోనే ఈ టార్గెట్ దాటిపోయి లాభాల్లోకి మూవీ వచ్చేసింది. ఇప్పుడు ‘బాహుబలి 1’ రికార్డ్ ని కూడా ఈ చిత్రం అధికమించింది. దసరా ఫెస్టివల్ హాలిడేస్ ముగియడంతో ఈ సినిమా ఇంకెన్ని రోజులు ఆడియన్స్ ని హోల్డ్ చేస్తుందనే దానిని బట్టి లాంగ్ రన్ ప్రాఫిట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకైతే 57+ కోట్లకి పైగా ప్రాఫిట్ ఈ సినిమాకి వచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News