తెలుగు రాష్ట్రాల్లో దేవర.. ఇప్పటి వరకు ఎంతొచ్చింది?
మొదట్లో కాస్త మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. వాటితో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది.
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్-1 రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. అనుకున్న స్థాయికి మించి దూసుకుపోతోంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సోలో హిట్ గా నిలిచి అదరగొడుతోంది. మొదట్లో కాస్త మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. వాటితో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. మేకర్స్ కు మంచి లాభాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది!
సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయిన దేవర మూవీ.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.410 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ మార్కును అందుకుంది. గాంధీ జయంతి నాటికే సెంచరీ కొట్టేసింది. ఆ రోజు నుంచి దసరా సెలవులు కూడా స్టార్ట్ కావడంతో థియేటర్లకు సినీ ప్రియులు తరలివెళ్తున్నారు. దావూది రే సాంగ్ ను రీసెంట్ గా మేకర్స్ యాడ్ చేయడంతో తారక్ ఫ్యాన్స్.. మళ్లీ చూస్తున్నారు. అయితే 9వ రోజు తెలుగు స్టేట్స్ లో దేవర వసూళ్లు ఎంతంటే?
నైజాం : 1.54 లక్షలు
సీడెడ్ : 0.95 లక్షలు
వైజాగ్ : 0.39 లక్షలు
తూర్పు గోదావరి : 0.23 లక్షలు
పశ్చిమ గోదావరి : 0.14 లక్షలు
గుంటూరు : 0.26 లక్షలు
కృష్ణ : 0.21 లక్షలు
నెల్లూరు : 0.17 లక్షలు
అలా తొమ్మిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీ రూ.3.89 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జీఎస్టీ లేకుండా రూ.115.95 కోట్లు సాధించినట్లు సమాచారం. మరి ఏ ఏరియాలో దేవర ఎప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో మీకోసం!
నైజాం : 44.87 లక్షలు
సీడెడ్ : 24.49 లక్షలు
వైజాగ్ : 12.06 లక్షలు
తూర్పు గోదావరి : 7.44 లక్షలు,
పశ్చిమ గోదావరి : 5.85 లక్షలు
గుంటూరు : 9.72 లక్షలు
కృష్ణ : 6.82 లక్షలు
నెల్లూరు : 4.70 లక్షలు
మొత్తం రూ. 115.95 కోట్లు!