దేవర.. కలెక్షన్స్ లో కొత్త ఫార్ములా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ తెలుగు రాష్ట్రలలో మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.

Update: 2024-09-29 09:56 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ తెలుగు రాష్ట్రలలో మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే 70 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ ని ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే వరల్డ్ వైడ్ గా 243 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. మూడో రోజైన ఆదివారం కూడా ‘దేవర’ సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

మూవీకి కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికి ప్రేక్షకాదరణ అయితే బాగుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక వీకెండ్ తర్వాత మూవీ ఏ మేరకు ప్రేక్షకులని హోల్డ్ చేసి థియేటర్స్ కి రప్పించగలుగుతుందనే దానిపై ఈ సినిమా సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. ఫ్యాన్స్ అయితే ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. ‘దేవర’ మూవీ థీయాట్రికల్ రైట్స్ నైజాంలో 45 కోట్లకి, ఏపీలో 55 కోట్లకి, సీడెడ్ 24 కోట్లకి అమ్మేశారు. సినిమాకి వస్తోన్న మిశ్రమ స్పందనకి ఈ కలెక్షన్స్ అందుకోవడం కష్టమనే మాట వినిపించింది.

అయితే ఇప్పుడు ‘దేవర’ మూవీపై కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు పెంచుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మేకర్స్ కి అనుమతి ఇచ్చారు. మొదటి పది రోజుల పాటు టికెట్ ధరలు అదనంగా అమ్ముకునే వెసులుబాటు లభించింది. దీనితో పాటు అదనపు షో లకి అనుమతి లభించింది. అయితే నైజాంలో ఇప్పుడు కొత్త పద్ధతి ఫాలో అవుతున్నారంట. థియేటర్స్ లో ఒక్కో షోని ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నారంట.

కావాల్సిన వారికి స్పెషల్ గా ఒక ధర ఫిక్స్ చేసి షోలు అమ్మేస్తున్నారంట. అందులో టికెట్ ధరలు 1000 నుంచి 2000 వేల వరకు అమ్ముతున్నారనే ప్రచారం నడుస్తోంది. హీరోలు, డైరెక్టర్స్, బయ్యర్లతో ఉన్న ఆబ్లిగేషన్ ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది నిర్మాతలు ఒక్కో షోని లక్షలు ఖర్చు చేసి తీసుకున్నారని టాక్. టికెట్ ధరలు కూడా విపరీతంగా పెంచేసి అమ్మేస్తున్నారంట. ఈ కారణంగా ‘దేవర’ మూవీకి తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల్లోనే భారీ షేర్ వచ్చిందని అంటున్నారు.

నిజానికి గతంలో ‘గుంటూరు కారం’ సినిమాని నైజాంలో 42 కోట్లకి అమ్మారు. అయితే మూవీకి ఫ్లాప్ టాక్ రావడంతో భారీగా నష్టాలు వచ్చాయి. ఇప్పుడు ‘దేవర’కి ఆ పరిస్థితి ఉండకపోవచ్చనే ప్రచారం నడుస్తోంది. మూడు, నాలుగు రోజుల్లోనే ‘దేవర’ సినిమా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ఆల్ మోస్ట్ వచ్చేస్తాయని మాట వినిపిస్తోంది. నైజాంలో ఈ కొత్త విధానం వలన థీయాట్రికల్ రైట్స్ 42 కోట్లయిన ఈజీగా కలెక్ట్ అయిపోతాయని అంటున్నారు. భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమాల నైజాం రైట్స్ 60-70 కోట్లకి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది.

Tags:    

Similar News