దేవర అర్ధరాత్రి షో… ఎన్ని థియేటర్స్ అంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.

Update: 2024-09-24 04:52 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 26న యూఎస్ లో స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే యూఎస్ లో స్పెషల్ ప్రీమియర్స్ షోలకి భారీగా టికెట్లు బుక్ అయ్యాయి. అలాగే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ‘దేవర’ 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ఇప్పటి వరకు అందుకుంది. ఇది నిజంగా రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో కూడా ‘దేవర’ స్పెషల్ షోలు పడుతున్నాయి.

ముఖ్యంగా నైజాంలో మొదటి రోజు అర్ధరాత్రి ఒంటి గంటకి స్పెషల్ షోలు వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నైజాంలో మొత్తం 29 స్క్రీన్స్ లో అర్ధరాత్రి 1 కి షోలు వేయబోతున్నారు. ఇక ఈ షోలకి టికెట్ పై 100 రూపాయిలు అదనంగా పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే మొదటి రోజు 4 గంటలకి మరో షో వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ షోలకి కూడా టికెట్ ధరని 100 రూపాయిలు ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం కల్పించారు.

ఈ లెక్క ప్రకారం నైజాంలో మొదటి రోజు ‘దేవర’కి 6 షోల వరకు పడనున్నాయి. టికెట్ ధరలు కూడా భారీగా పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో బుక్ మై షోలో ఇప్పటికే అమ్మకాలు మొదలు పెట్టారు. ఏపీలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. దీనిని బట్టి దేవర మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ వరకు బుక్ మై షోలో మల్టీ ప్లెక్స్ టికెట్స్ ఓపెన్ చేయగా ఆల్ మోస్ట్ చాలా వరకు హౌస్ ఫుల్ అయిపోయాయి.

మొదటి 10 రోజుల వరకు రోజుకి ఐదు షోలు వేసుకోవడానికి అనుమతులు లభించాయి. సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా ఏపీ, తెలంగాణాలో కలెక్షన్స్ సునామి సృష్టించడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా ‘దేవర’ మూవీ వస్తోంది. దీంతో ఫ్యాన్స్ చాలా ఆకలి మీద ఉన్నారు. మూవీ ప్రమోషన్స్ కూడా మేకర్స్ స్ట్రాంగ్ గానే చేశారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ కి క్రౌడ్ ఎక్కువ మంది రావడం వలన కంట్రోల్ చేయడం కష్టం అయ్యింది. దీంతో ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం ద్వారా ‘దేవర’ సినిమాకి ఎక్స్ ట్రా మైలేజ్ వచ్చిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ‘దేవర’లో ఎన్టీఆర్ యాక్షన్ ఎలివేషన్, జాన్వీ కపూర్ గ్లామర్ షో, సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ విలనిజం చూడటానికి ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News