దేవర.. UK లో కూడా న్యూ రికార్డ్ బ్లాస్ట్
ఇటీవల కాలంలో అత్యధిక వేగంగా ఈ మార్క్ ను అందుకున్న ఇండియన్ సినిమాల్లో ఒకటిగా దేవర రికార్డ్ క్రియేట్ చేసింది
జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర: పార్ట్ 1 చిత్రం సెప్టెంబర్ 27 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళి శర్మ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక దేవర టీమ్ ఇప్పటికే ప్రమోషన్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది.
ప్రీ-సేల్స్ ద్వారా అమెరికా బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. ఇటీవల కాలంలో అత్యధిక వేగంగా ఈ మార్క్ ను అందుకున్న ఇండియన్ సినిమాల్లో ఒకటిగా దేవర రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమాపై బజ్ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ రికార్డ్ తో పాటు, యూకేలో కూడా మరో ఘనత సాధించింది. ఇది డోల్బీ ఆట్మాస్ టెక్నాలజీలో విడుదలయ్యే తొలి తెలుగు సినిమా కావడం విశేషం.
ఈ రిలీజ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సినిమాపై అంచనాలు పెరిగాయి. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఎన్టీఆర్ ఎమోషనల్ డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఇకపోతే, దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా యూనిట్ కూడా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉండటంతో, ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఊహించని స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా. ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచేందుకు దేవర చిత్రం అన్ని విధాలా సిద్ధంగా ఉంది.
రిలీజ్ అనంతరం పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ లెక్క మొదటి రోజే 100 కోట్లకు చేరవచ్చు. ఇప్పటివరకు సోలో హీరోగా ఎన్టీఆర్ ఈ రేంజ్ లో రికార్డ్ అందుకోలేదు. ఇక దేవర తప్పకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చుతుంది అని కొరటాల శివ కూడా చాలా కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు. కాబట్టి టాక్ బాగుంటే తారక్ బిజినెస్ ఈ సినిమాతో మరింత పెరగవచ్చు. ప్రస్తుతం దేవర టీమ్ చెన్నై ప్రమోషన్ లో బిజీగా ఉంది. అలాగే కన్నడలో కూడా స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో ఒక గ్రాండ్ ఈవెంట్ జరగనుంది.