11 రోజుల్లో దేవర నైజాం కలెక్షన్స్ ఎంతంటే?
11 రోజుల్లో 'దేవర' మూవీ నైజాంలో 47.54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పటికి థియేటర్స్ లో సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' మూవీ తెలుగు రాష్ట్రాలలో మెల్లగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దిశగా అడుగులు వేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 100 కోట్ల షేర్ కలెక్షన్స్ ని ఈ చిత్రం క్రాస్ చేసింది. అయితే సినిమా థీయాట్రికల్ బిజినెస్ టార్గెట్ ని అందుకోవాలంటే దసరా వరకు ఈ మూవీ సాలిడ్ వసూళ్లని అందుకోవాల్సి ఉంటుంది. నైజాంలో 'దేవర' మూవీ పైన 50 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. ఎన్టీఆర్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ డీల్ అని చెప్పాలి.
11 రోజుల్లో 'దేవర' మూవీ నైజాంలో 47.54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పటికి థియేటర్స్ లో సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇదే జోరులో దసరా వరకు మూవీ కొనసాగితే 50 కోట్ల షేర్ క్రాస్ చేయడంతో పాటు లాభాల్లోకి వెళ్లడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 11వ రోజు ఈ చిత్రానికి నైజాంలో 73 లక్షలు షేర్ వచ్చింది. మరల ఈ కలెక్షన్స్ దసరా ఫెస్టివల్ టైంలో పెరుగుతాయని భావిస్తున్నారు.
ఇక వరల్డ్ వైడ్ గా కూడా 'దేవర' మూవీ 182.25 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. 'దేవర' మూవీ 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చింది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటుకొని హిట్ బొమ్మగా మారనుంది. ఆపై లాంగ్ రన్ లో ఏ మేరకు కలెక్షన్స్ అందుకుంటుంది అనే దానిపై సినిమా సక్సెస్ రేంజ్ ఆధారపడి ఉంటుంది.
'దేవర' సినిమాకి క్రిటిక్స్ నుంచి మిశ్రమ రివ్యూలు వచ్చిన కూడా ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారని ఈ కలెక్షన్స్ బట్టి స్పష్టం అవుతోంది. ఫ్యాన్స్ అయితే ఆల్ మోస్ట్ ఈ మూవీ విషయంలో సంతృప్తికరంగా ఉన్నారు. రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చూడటానికి ఆసక్తి చూపిస్తూ 'దేవర' సినిమాకి వెళ్తున్నారు. అలాగే కథని కంప్లీట్ ఫిక్షనల్ వరల్డ్ లో చెప్పడం కూడా మూవీకి ప్లస్ అయ్యిందనే మాట వినిపిస్తోంది.
లాంగ్ రన్ లో 600 కోట్ల వరకు ఈ మూవీ వసూళ్లు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'దేవర' మూవీ కమర్షియల్ సక్సెస్ దిశగా అడుగులు వేయడంతో 'దేవర పార్ట్ 2' పైన అంచనాలు పెరగడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే కొరటాల శివ వీలైనంత వేగంగా 'దేవర పార్ట్ 2' ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని విశ్లేషకులు చెబుతున్నారు.