దేవర ట్రైలర్: ధైర్యాన్ని చంపే భయం అతడు

సినిమా ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా కొరటాల శివ డిజైన్ చేసినట్లుగా అనిపిస్తోంది.

Update: 2024-09-10 11:41 GMT

జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఈనెల 27వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. బాలీవుడ్ నుంచే అసలు హడావిడి మొదలుపెట్టేశారు. ఇక ఫ్యాన్స్ తో పాటు చాలామంది సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఆ సమయం రానే వచ్చేసింది. సినిమా ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా కొరటాల శివ డిజైన్ చేసినట్లుగా అనిపిస్తోంది.


ముఖ్యంగా ఇందులో యాక్షన్ డోస్ అయితే అసలు ఏ మాత్రం తక్కువ ఉండదు అని అర్థమవుతుంది. రెండు విభిన్నమైన పాత్రలలో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా దేవర పాత్ర చాలా వైలెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది.

భయం అంటే తెలియని భైరా అతని సైన్యం, మనుషులను చంపేందుకు మొండి ధైర్యంతో కనిపిస్తున్నారు. ఇక వారిని ఎదిరించే యోధుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా అతను చెప్పిన డైలాగ్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. శత్రువు ధైర్యానికే భయాన్ని చూపించే పవర్ఫుల్ హీరోగా అతను హైలెట్ కాబోతున్నట్లు ట్రైలర్లో చాలా క్లారిటీగా చూపించారు. అలాగే పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో ఫ్యాన్స్ కు అయితే ఈ సినిమా ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు ఈ ట్రైలర్ ద్వారా మరొక రేంజ్ కు వెళతాయి అని చెప్పవచ్చు. ఒక పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా మరొక పాత్రలో కొడుకు కనిపించబోతున్నట్లుగా అర్థమవుతుంది. అంతేకాకుండా దేవర పాత్రలో ధైర్యవంతుడిగా మరొక పాత్రలో చాలా సౌమ్యుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక జాన్వి కూడా ఒక పల్లెటూరి అమ్మాయిలాగా చాలా కొత్తగా కనిపిస్తోంది. మరోవైపు సైఫ్ అలీఖాన్ కూడా తనలోని రాక్షసత్వాన్ని చాలా బలంగా చూపించబోతున్నట్లు ఒకటి రెండు సీన్లతోనే అర్ధమవుతుంది. సినిమాలో శ్రీకాంత్ అజయ్ లాంటి టాలీవుడ్ నటులు ప్రత్యేకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. అంచనాలకు ఎక్కడ తగ్గకుండా సినిమాలో విజువల్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సముద్రానికి సంబంధించిన సన్నివేశాలు కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయి.

ట్రైలర్ చివరలో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఒక సొర చేపతోనే సవారీ చేయడం ఫాన్స్ కు కిక్కిచ్చే సీన్ అని చెప్పవచ్చు. సినిమా కథపై కూడా దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చేశాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో ఉండే ట్విస్ట్ ఏమిటి అనేది సినిమాలోనే చూడాలి. చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద తప్పకుండా మొదటి రోజు ఈ సినిమా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ట్రైలర్ మిగతా భాషల్లో ఏ స్థాయిలో క్లిక్ అవుతుందో చూడాలి

Full View
Tags:    

Similar News