దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. అన్ని లక్షల నష్టమా?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర పార్ట్-1.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.

Update: 2024-09-24 12:55 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర పార్ట్-1.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. పరిమితికి మించి అభిమానులు రావడంతో ఈవెంట్ రద్దు అయింది. దీంతో ఫ్యాన్స్ అంతా నిరాశగా వెనుదిరిగారు. ఆరేళ్ల తర్వాత తమ అభిమాన హీరో సోలో సినిమా వేడుక క్యాన్సిల్ అవ్వడంతో ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఫ్యాన్స్ కు సారీ చెప్పారు తారక్. ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణంగా ఆర్గనైజర్స్ లేదా నిర్మాతలను తిట్టడం సరికాదని తెలిపారు.

సినిమా కాలర్ ఎగరేసేలా ఉంటుందని చెప్పి అంచనాలు పెంచారు తారక్. నిర్మాతలు కూడా ఫ్యాన్స్ నుంచి క్షమాపణలు కోరుతూ స్టేట్మెంట్ విడుదల చేశారు. హీరోయిన్ జాన్వీ కపూర్.. ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో మూవీ రిలీజ్ అయ్యాక వచ్చి కలుస్తానని తెలిపారు. ఈవెంట్ బాధ్యతలు తీసుకున్న శ్రేయాస్ మీడియా సీఈవో.. రద్దు వెనుక కారణాలు వివరించారు. 5500 మంది సామర్థ్యం ఉండగా.. తాము 4 వేల పాసులు ఇచ్చామని తెలిపారు. కానీ 35000 మంది అభిమానులు వచ్చినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ తెలిపినట్లు చెప్పారు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ రోజు ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. నోవాటెల్ లోపలికి వెళ్లడానికి పర్మిషన్ లేదన్నా తోసుకుని మరీ వెళ్లారు. తలుపులు కూడా బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. మెయిన్ గ్లాస్, ఎలివేటర్ గ్లాస్ ధ్వంసం అయినట్లు సమాచారం. హోటల్ లోకి వెళ్లాక.. ఈవెంట్ క్యాన్సిల్ అని అనౌన్స్ చేయడంతో కొందరు దారుణంగా కుర్చీలు విరగొట్టారు. 5వేల కుర్చీలు ధ్వంసం చేశారు. దీంతో ప్రీ రిలీజ్ వేడుక రద్దు అవ్వడం మేకర్స్ కు నష్టమే.. కానీ అంతకుమించి భారీ నష్టం నోవాటెల్ కు వాటిల్లింది.

దీంతో ఇప్పుడు నోవాటెల్.. రూ.33 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక్క కుర్చీల బిల్లే రూ.7 లక్షలు అని టాక్ వినిపిస్తోంది. దాదాపు 40 రూమ్స్ ను ఈవెంట్ కోసం నిర్వాహకులు బుక్ చేశారట. కానీ సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఎవరూ లోపలికి కూడా వెళ్లలేదు. అక్కడికి వచ్చిన త్రివిక్రమ్, నాగవంశీ, రామజోగయ్య శాస్త్రి కార్లలో వెనక్కి వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రూమ్స్ ను బుక్ చేసి టీమ్ కోసం ఉంచడంతో రూ.12 లక్షలు లాస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ మొత్తాన్ని కూడా నోవాటెల్ యాజమాన్యం చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. కానీ కొన్ని చర్చల తర్వాత.. రూమ్స్ వల్ల వచ్చిన నష్టానికి మినహాయింపు ఇచ్చిందని తెలుస్తోంది. అలా ఇప్పుడు రూ.33 లక్షల వరకు నోవాటెల్ నష్టపోయిందని సమాచారం. దీంతో దాన్ని చెల్లించాలని దేవర మేకర్స్ కు కోరిందట. కానీ కొంత మొత్తంలో తగ్గించాలని దేవర మేకర్స్ రిక్వెస్ట్ చేసినట్లు వినికిడి. మరి నోవాటెల్ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News