దేవర టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి?

పాన్ ఇండియా రేంజ్ లో ఐదు ఇండియన్ భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-15 04:54 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు ఇండియన్ భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని దగ్గరుండి పబ్లిక్ లోకి తీసుకొని వెళ్తున్నారు. కచ్చితంగా ‘దేవర’ మూవీ దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

పాన్ ఇండియా సినిమాలకి తెలుగు రాష్ట్రాలలో టికెట్స్ పెంచడం ఆనవాయితీగా వస్తోంది. మేకర్స్ ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి దరఖాస్తు చేసుకుంటే టికెట్ ధరలని పర్టిక్యులర్ టైం వరకు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఇలా టికెట్ ధరలు పెంచడం వలన పాన్ ఇండియా సినిమాలకి కలెక్షన్స్ పరంగా అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. ‘దేవర’ సినిమాకి కూడా ఇప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వబడుతున్నాయి.

ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 200, మల్టీప్లెక్స్ 325 రూపాయిలు టికెట్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణాలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 250, మల్టీ ప్లెక్స్ లలో 413 రూపాయిల ధరకి టికెట్స్ అమ్ముకునే అవకాశం ఉంటుంది. అలాగే ఐదు షోలకి కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పెంచిన ధరలతో కచ్చితంగా ‘దేవర’ మూవీ మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

టికెట్ ధరలు పెంచిన కూడా ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన రావడం గ్యారెంటీ అని మేకర్స్ భావిస్తున్నారు. కానీ కాంటెంట్ బలంగా క్లిక్కయితేనే మిగతా ఆడియెన్స్ కూడా థియేటర్స్ కు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా కంటెంట్ హీరో. ఇక సినిమాపై ఉన్న బజ్ కారణంగా నార్త్ అమెరికాలో ‘దేవర’ మూవీ టికెట్స్ జెట్ స్పీడ్ తో బుక్ అవుతున్నాయి. ఇదే జోరు ఇండియాలో కూడా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘దేవర’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 22న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. దీనికి ఐకాన్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరో వైపు ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ కోసం సెప్టెంబర్ 25న ఎన్టీఆర్ యూఎస్ వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రీమియర్ షోలకి తారక్ అటెండ్ అయ్యి ఫ్యాన్స్ తో మాట్లాడుతారు.

Tags:    

Similar News