దేవర థియేట్రికల్ రైట్స్.. స్టన్నింగ్ డీల్ కోసం మైత్రి?

టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ మరో వైపు డిస్టిబ్యూషన్ లో కూడా దూసుకుపోతోంది

Update: 2024-01-19 06:30 GMT

టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ మరో వైపు డిస్టిబ్యూషన్ లో కూడా దూసుకుపోతోంది. పెద్ద సినిమాలకి సంబందించిన రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకుంటూ లాభాలు సొంతం చేసుకుంటుంది. తాజాగా సంక్రాతి బరిలో రిలీజ్ అయినా హనుమాన్ మూవీ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకొని రిలీజ్ చేసి భారీ లాభాలు ఆర్జిస్తోంది.

ఇక డిస్టిబ్యూషన్ రంగంలో మరింత అగ్రెసివ్ గా ముందుకి వెళ్లాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోంది. కేవలం ఒక ఏరియాకి పరిమితం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పంపిణీ రంగంలో దూసుకుపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ అడుగులు వేస్తోంది. దిల్ రాజు తరహాలోనే సొంతంగా థియేటర్స్ ని కూడా నిర్మించే యోచనలో మైత్రీ నిర్మాతలు ఉన్నారు.

ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఎన్ఠీఆర్ దేవర మూవీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ, తారక్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రిలీజ్ రైట్స్ ని భారీ ధరకి మైత్రీ డిస్టిబ్యూషన్ కంపెనీ సొంతం చేసుకుందని టాక్.

నిర్మాతలు తెలుగు స్టేట్స్ కోసం ఏకంగా 110 కోట్లు డిమాండ్ చేశారంట. ఈ డీల్ కి సంబందించిన ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. దాదాపు క్లోజ్ అయ్యే స్టేజ్ లో చర్చలు ఉన్నాయంటే. తెలుగు రాష్ట్రాల వరకు 110 కోట్ల డీల్ అంటే ఎక్కువ మొత్తమని చెప్పొచ్చు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉన్నాయి.

Tags:    

Similar News