'క‌ల్కి'లో దేవ‌ర‌కొండ జాక్‌పాట్?

భారీ తారాగ‌ణంతో అత‌డు చేస్తున్న ఈ భారీ ప్ర‌యోగం భార‌త సినీచ‌రిత్ర‌లో మ‌రో అద్భుతంగా మారుతుంద‌ని అంతా భావిస్తున్నారు.

Update: 2024-01-19 02:45 GMT

డార్లింగ్ ప్ర‌భాస్ న‌టిస్తున్న `కల్కి 2898 AD` సైన్స్ ఫిక్ష‌న్- ఫాంట‌సీ నేప‌థ్యంలో రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వని దత్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. కాస్టింగ్ ఎంపిక‌ల‌తోనే నాగ్ అశ్విన్ ఆస‌క్తిని పెంచాడు.

భారీ తారాగ‌ణంతో అత‌డు చేస్తున్న ఈ భారీ ప్ర‌యోగం భార‌త సినీచ‌రిత్ర‌లో మ‌రో అద్భుతంగా మారుతుంద‌ని అంతా భావిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఈ చిత్రంలో మ‌రో ఇద్ద‌రు స్టార్ హీరోలు అతిథి పాత్ర‌ల్లో న‌టిస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇప్ప‌టికే మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ఒక అతిథి పాత్ర‌లో న‌టిస్తాడ‌ని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే దీనిని దుల్క‌ర్ అధికారికంగా క‌న్ఫామ్ చేయ‌లేదు. ఇంత‌లోనే ఇందులో పొడిగించిన అతిథి పాత్ర‌లో రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా న‌టిస్తున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అత‌డి పాత్ర నిడివి కూడా ఎక్కువ‌గానే ఉంటుంద‌న్న టాక్ ఉంది.

క‌ల్కి ప్రాజెక్ట్ గురించి ఎంతో ఎగ్జ‌యిటెడ్ గా ఉన్నానంటూ ఆస‌క్తిని వ్య‌క్తం చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఇందులో త‌న ఫేవ‌రెట్ స్టార్లంతా న‌టిస్తున్నార‌ని అన్నాడు. ఇంత‌లోనే దేవ‌ర‌కొండ‌కు కూడా ఇందులో ఒక అతిథి పాత్ర‌ను నాగ్ అశ్విన్ ఆఫ‌ర్ చేసార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం టైమ్ నుంచి ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం ఉంది. ఆ త‌ర్వాత మ‌హాన‌టి, జాతి ర‌త్నాలులోను దేవర‌కొండ అతిథిగా మెరిసాడు. ఇప్పుడు భారీ పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలో మ‌రోసారి క‌లిసి ప‌ని చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని చెబుతున్నారు. అయితే ఈ వార్త‌ల్ని ఇప్ప‌టివ‌ర‌కూ చిత్ర‌బృందం కానీ దేవ‌ర‌కొండ కానీ అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే లెజెండ‌రీ క‌మ‌ల్ హాస‌న్, ప్ర‌భాస్ లాంటి స్టార్ల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం దేవ‌ర‌కొండ ఇమేజ్ ని పెంచుతుంద‌న‌డంలో సందేహం లేదు.

మే 9న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ ఎక్స్ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయ‌ని స‌మాచారం. అంత‌ర్జాతీయ సినిమా ఉత్స‌వాల్లో ఇప్ప‌టికే నాగ్ అశ్విన్ ఈ సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నాడు. ఏప్రిల్ నుంచి మ‌రింత‌గా ప్ర‌చారం చేసేందుకు టీమ్ సిద్ధ‌మ‌వుతోంది.

Tags:    

Similar News