దేవర లీక్స్ మ్యాటరెంటీ ?

అయితే ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ముందుగా అనుకున్నారు.

Update: 2024-07-29 09:28 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల కాంబినేష‌న్‌ లో రానున్న ఈ చిత్రంపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

అయితే ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ముందుగా అనుకున్నారు. కానీ షూటింగ్ ఎక్కువ పెండింగ్ ఉండడంతో అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ కు ప్రీపోన్ చేశారు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే సెకండ్ సింగిల్ ను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఎన్టీఆర్ లుక్ లీక్ అయింది. లీక్డ్ ఫోటోలో ఎన్టీఆర్ మాస్ లుక్‌ లో కనిపిస్తున్నారు. గ‌డ్డం, ఉంగరాల జుట్టు, మెలితిరిగిన కండ‌ల‌తో ఎన్టీఆర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నారు. దీంతో నెటిజన్లు, అభిమానులు ఆ ఫోటోను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ డిఫ‌రెంట్‌ గా కనిపిస్తున్నారని అంటున్నారు. మాస్ లుక్ లో అదరగొట్టేశారని చెబుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

దీంతో లీక్డ్ పిక్.. తారక్ మరో రోల్ కు సంబంధించినది అయ్యి ఉంటుందని చెబుతున్నారు. పవర్ ఫుల్ పిక్ అని ట్రెండ్ చేస్తున్నారు. పిక్స్ చూస్తుంటే ఫుల్ మాస్ గా కొరటాల సినిమా తీస్తున్నట్లు అర్థమవుతుందని అంటున్నారు. అయితే దేవర మూవీ సెట్స్ నుంచి ఫోటోస్ లీక్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా బయటకు వచ్చాయి. గోవాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బీచ్ లో షూట్ చేసిన ఒక సీన్ లీక్ అయింది. అందులో ఎన్టీఆర్ నడుస్తూ కనిపించారు.

ఆ తర్వాత గోవా షెడ్యూల్ లోనే జరిగిన పడవ సీన్ కూడా లీకైంది. దీంతో దేవర మేకర్స్ అలెర్ట్ అయ్యి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయినా లీక్స్ బెడద తప్పట్లేదు. అయితే లీక్ అయిన పిక్స్ లో ఎన్టీఆర్ ను చూశామన్న హ్యాపీ నెస్ ఉన్నా.. లీక్స్ అవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు.. లీక్ అవ్వడం ఎలానో అయింది.. ఇక షేర్ చేయడం ఆపండని కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా దేవర మంచి మాస్ ఎంటర్టైనర్ గా రానుండడం పక్కా అనే చెప్పాలి.

Tags:    

Similar News