దేవర ముందున్న సవాళ్లు ఎన్నో..!

దేవర సినిమా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. RRR తర్వాత వస్తున్న సినిమాగా వస్తున్న దేవర అంచనాలకు మించి ఉండాల్సిందే.

Update: 2024-02-17 11:30 GMT
దేవర ముందున్న సవాళ్లు ఎన్నో..!
  • whatsapp icon

యంగ్ టైగర్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్.టి.ఆర్ కొరటాల శివతో చేస్తున్న సినిమా దేవర. ఆల్రెడీ జనతా గ్యారేజ్ తో ఈ ఇద్దరి కాంబో సూపర్ హిట్ అనిపించుకోగా మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. అయితే RRR తర్వాత చేస్తున్న సినిమా అవ్వడం వల్ల దేవర మీద పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ లో వస్తుంది అనుకున్న దేవర కాస్త అక్టోబర్ కి షిఫ్ట్ అయ్యింది. సమ్మర్ రేసులో దిగుతుందని అనుకున్న దేవర దసరా బరిలో వస్తున్నాడు. అయితే దేవర సూపర్ హిట్ కొట్టి తన స్టామినా మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు ఎన్.టి.ఆర్.

దేవర సినిమా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. RRR తర్వాత వస్తున్న సినిమాగా వస్తున్న దేవర అంచనాలకు మించి ఉండాల్సిందే. కథ కథనాలతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించేలా సినిమా ఉండాలి. ఇక మరోపక్క దేవర ముందు ఆచార్య తీసిన కొరటాల శివ ఆ సినిమా తో డిజాస్టర్ ఫేస్ చేశాడు. ఇప్పుడు దేవరతో కొరటాల శివ కూడా తన డైరెక్షన్ టాలెంట్ చూపించాల్సి ఉంది.

దేవరని వెంటాడుతున్న మరో బ్యాడ్ సెంటిమెంట్ ఏంటంటే. రాజమౌళి సినిమాతో ఏ హీరో అయితే హిట్ కొడతాడో ఆ తర్వాత సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అందుకుంటాడు. RRR తర్వాత భారీ అంచనాలతో మెగా మల్టీస్టారర్ గా వచ్చిన ఆచార్య రిజల్ట్ ఏంటో తెలిసిందే. అది చూశాక దేవర ఫలితం ఏమవుతుందో అని ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ పట్టుకుంది.

పండుగ టైం లో సినిమా రిలీజ్ అంటే కచ్చితంగా పోటీ రసవత్తరంగా ఉంటుంది. దసరా అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేయగా అదే సీజన్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ ఉంది. శంకర్ డైరెక్షన్ లో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో గేమ్ చేంజర్ వస్తుంది. ఆ సినిమా నుంచి దేవరకి గట్టి పోటీ ఉంటుందని చెప్పొచ్చు. కేవలం గేమ్ చేంజర్ మాత్రమే కాదు హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా జోకర్ 2 కూడా దసరా టైం లోనే భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

కేవలం తెలుగు సినిమాలే కాదు బాలీవుడ్ సినిమాలు కూడా దసరా టైం లో అక్టోబర్ లో రిలీజ్ షెడ్యూల్ చేసుకున్నాయి. దేవర పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ సినిమాల నుంచి కూడా తారక్ సినిమాకు ఫైట్ తప్పేలా లేదు. ఇదికాకుండా అక్టోబర్ లో ఎన్.టి.ఆర్ నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ కాగా వాటిలో రెండు హిట్లు అయ్యాయి.. రెండు ఫ్లాప్ అయ్యాయి. అది కూడా ఒక రెడ్ అలర్ట్ గా చెప్పుకోవచ్చు.

దేవర కొరటాల శివ నుంచి వస్తున్న ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీ. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మొదటి భాగం అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేశారు. మరి దేవర ఈ సవాళ్లను దాటి సూపర్ హిట్ అందుకుంటుందా. మిగతా సెంటిమెంట్ లు అన్నీ అందరికీ కానీ తనకు కాదని తారక్ ప్రూవ్ చేస్తాడా. దేవర ముందున్న ఈ రిస్కులను దాటి బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడా అన్నది చూడాలి.

Tags:    

Similar News