'దేవర' ఆధిపత్యం కొనసాగుతోంది!

నెట్‌ ఫ్లిక్స్‌లో గత నాలుగు వారాలుగా ఈ సినిమా టాప్‌లో ట్రెండ్‌ అవుతూనే ఉంది. మరోసారి టాప్‌లో ఉన్నట్లుగా నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

Update: 2024-12-04 06:30 GMT

ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్‌లో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ను రాబట్టుకోవడంతో వసూళ్ల విషయంలో దేవర కి హిట్‌ దక్కింది. సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. నెట్‌ ఫ్లిక్స్‌లో గత నాలుగు వారాలుగా ఈ సినిమా టాప్‌లో ట్రెండ్‌ అవుతూనే ఉంది. మరోసారి టాప్‌లో ఉన్నట్లుగా నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

దేవర సినిమా వరుసగా 4వ వారం ట్రెండ్‌ అవుతోంది అంటూ యూనిట్‌ సభ్యులు అధికారికంగా వెళ్లడించారు. 2.8 మిలియన్‌ల వ్యూస్‌తో 8.1 మిలియన్‌ల వాచ్‌ అవర్స్‌తో దేవర ఆధిపత్యం కొనసాగుతోంది అంటూ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా సోషల్‌ మీడియా ద్వారా ఫోటోలను షేర్‌ చేయడం జరిగింది. ఏడు దేశాల్లో దేవర సినిమా టాప్‌ 10 ప్లేస్‌ల్లో కొనసాగుతోంది. ఆఫ్రికాలోని ఒక దేశంతో పాటు ఆసియాలో ఇండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవ్స్‌, శ్రీలంక, యూఏఈ లో ఈ సినిమా ట్రెండ్‌ అవుతున్నట్లుగా నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

బ్లాక్‌బస్టర్‌గా థియేట్రికల్‌ రన్‌తో నిరూపించుకున్న దేవర సినిమా ఇప్పుడు ఓటీటీ లోనూ బ్లాక్‌బస్టర్ మాసివ్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ స్థాయి విజయాన్ని ఓటీటీ ద్వారా ఫ్యాన్స్ సైతం ఊహించలేదు. వరుసగా నాలుగు వారాలు, అది కూడా విదేశాల్లోనూ దేవర సినిమాను జనాలు ఈ స్థాయిలో చూడటం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, ఎన్టీఆర్‌ కి వచ్చిన స్టార్‌డం కారణంగా దేవర సినిమాను అన్ని దేశాల్లోనూ తెగ చూస్తున్నారు అనే టాక్‌ వినిపిస్తుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌కి ఈ సినిమాతో భారీ విజయం దక్కింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్టీఆర్‌కి గుర్తింపు తెచ్చి పెట్టింది. అందుకే ఎన్టీఆర్ దేవర సినిమాకి సైతం మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌ వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎన్టీఆర్‌ దేవర పార్ట్‌ 2 సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News